కొత్త అవతారం ఎత్తిన సోనుసూద్..!!

లాక్ డౌన్ సమయం లో కొన్ని లక్షల మంది వలస కూలీలు ఆదుకుని తనలో మానవత్వాన్ని చాటిన సోనుసూద్ ఇంకా తన సేవలు పేదవాళ్లకు అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. చదువుకోలేని పేదవాళ్లకు స్కాలర్షిప్ లు , ఉపాధి లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పించే రీతిలో వ్యవహరిస్తూ వస్తున్న సోనూసూద్, అప్పుడప్పుడు సరికొత్త ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.

Sonu Sood stopped from meeting migrant workers in Mumbai? Here's what the  actor has to say | Mumbai News Updatesఈ క్రమంలో గతంలో హైదరాబాద్ నగరంలో ఓ రెస్టారెంట్ ఓనర్ తన అభిమాని కావటంతో అందులో వంట చేసే వ్యక్తిగా అవతారమెత్తి.. కొన్ని వంటకాలు చేయడం జరిగింది. కాగా తాజాగా మరో కొత్త అవతారం ఎత్తాడు సోనూసూద్. మళ్లీ హైదరాబాద్లోనే తాజాగా ఓ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెట్లో టైలరింగ్ చేస్తూ కొన్ని దుస్తులు కూట్టడం జరిగింది.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. సోను టైలరింగ్ గా అవతారమెత్తడం తో చాలా మంది నెటిజన్లు సింపుల్ అండ్ రియలిస్టిక్ హీరో కి కేరాఫ్ అడ్రస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ నటించిన క్రాక్ సినిమా ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో సోను సూద్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సినిమాకి సంబంధించి తెలుగు రైట్స్ విషయంలో.. క్రాక్ సినిమా నిర్మాత ఠాగూర్ తో కూడా సోనుసూద్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.