NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సోనూ సూద్ మరో సాయం.. తెలంగాణ బాలుడికి 20 లక్షలు

sonusood donated 20 lakhs for boy liver transplantation operation

సోనూసూద్.. అది ఒక పేరు మాత్రమే కాదు.. ఒక శక్తి. ఒక భరోసా. ఒక నమ్మకం. సోనూసూద్ పేరు వింటే చాలు.. మనసుకు హాయిగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే.. ఆదుకునే ఒక వ్యక్తి ఉన్నాడు.. అని అనిపిస్తుంది సోనూసూద్ ను చూస్తే. దేవుళ్లు మనుషుల రూపంలో ఉంటారు అనేది సోనూసూద్ ను చూసి నేర్చుకోవచ్చు.

sonusood donated 20 lakhs for boy liver transplantation operation
sonusood donated 20 lakhs for boy liver transplantation operation

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లలేక కష్టాలు పడుతుంటే వెంటనే తన వంతు సాయంగా వలస కూలీలకు సపరేట్ రైళ్లు, బస్సులు, విమానాలు వేయించి వాళ్ల ఊళ్లకు పంపించారు సోనూసూద్. దీంతో ఆయనలో ఉన్న సాయ గుణం బయటపడింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనూసూద్.. తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఏం కావాలన్నా అది ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన వందల మందికి సాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

తాజాగా మరోసారి తన ఉదార స్వభావాన్ని సోనూసూద్ చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్ అనే 6 ఏళ్ల బాలుడికి 20 లక్షల సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు.హర్షవర్ధన్ అనే బాలుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉంది. దానికి కనీసం 20 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో… ఏం చేయాలో తెలియని ఆ బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ లో సోనూసూద్ ను కలిశారు. తమ సమస్యను ఆయనకు విన్నవించుకున్నారు.

ఆ బాలుడి కష్టం చూసిన సోనూసూద్ చలించిపోయారు. వెంటనే బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.హర్షవర్ధన్ పుట్టినప్పటి నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి ఆ బాలుడికి చికిత్స చేయిస్తున్నా తగ్గడం లేదు. ఇప్పుడు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్ కు 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తమ దగ్గర అంత స్తోమత లేకపోవడంతో.. ఎలాగైనా సోనూసూద్ ను కలవాలని అనుకున్నారు.

హైదరాబాద్ కు షూటింగ్ కోసం సోనూసూద్ వస్తున్నారని తెలుసుకొని.. ఆయన దగ్గరికి వెళ్లి కలిశారు. వెంటనే స్పందించిన సోనూ సూద్.. బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని.. బాలుడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. తమ కొడుకుకు పునర్జన్మను ప్రసాదించిన సోనూసూద్ కు వాళ్లు ధన్యవాదాలు తెలిపారు.

author avatar
Varun G

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?