NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సోనూసూద్ మరో సాయం.. ఈసారి విద్యార్థుల కోసం ఏం చేశారంటే?

sonusood installs network tower in haryana

సోనూసూద్ లో నిజమైన హీరో ఉన్నాడని ఆయన సినిమాల్లో మాత్రమే విలన్ అనే విషయం కరోనా వల్ల బయటపడింది. లాక్ డౌన్ లో వలస కూలీలను తన సొంత ఖర్చులతో వాళ్ల సొంతూళ్లకు పంపించి.. అందరి మనసును గెలిచిన సోనూసూద్.. అప్పటి నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూనే ఉన్నారు. తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. ఎవరు సాయం కోసం తన దగ్గరికి వచ్చినా వెంటనే సాయం అందిస్తున్నారు.

sonusood installs network tower in haryana
sonusood installs network tower in haryana

ఇటీవల కూడా ఆయన చేసిన ఆర్థిక సాయాల గురించి చదివాం. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వల్ల ప్రస్తుతం పాఠశాలలన్నీ ఆన్ లైన్ లో పాఠాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్యానాలోని మొర్ని ప్రాంతంలో ఓ విద్యార్థి ఆన్ లైన్ క్లాసెస్ వినడం కోసం చెట్టు ఎక్కాల్సి వచ్చేసింది. ఎందుకంటే.. ఆ ఊళ్లో మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా ఉండదు. దీంతో చెట్టు ఎక్కితే కానీ సిగ్నల్ అందని పరిస్థితి. చెట్టు ఎక్కి నెట్ వర్క్ వస్తే.. దాని ద్వారా ఇంటర్ నెట్ ను యాక్సెస్ చేసి అప్పుడు ఆన్ లైన్ క్లాసెస్ వినేవాడు. కానీ.. అది చాలా డేంజర్ కదా. ప్రతి రోజు ఇలా చెట్టు ఎక్కడం.. చెట్టు మీద క్లాసులు వినడం అనేది చాలా ఇబ్బంది.

sonusood installs network tower in haryana
sonusood installs network tower in haryana

ఈ విషయం ట్విట్టర్ ద్వారా సోనూసూద్ కు తెలిసింది. వెంటనే సోనూసూద్. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఎయిర్ టెల్ కంపెనీతో కూడా మాట్లాడి అక్కడ వెంటనే ఎయిర్ టెల్ టవర్ ను స్థాపించేలా చర్యలు తీసుకున్నారు. ఎయిర్ టెల్ టవర్ స్థాపనకు అయ్యే ఖర్చులన్నీ సోనూసూదే భరించారట.

sonusood installs network tower in haryana
sonusood installs network tower in haryana

చాలా ఏళ్ల నుంచి మా ఊళ్లో మొబైల్ టవర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేయాలంటే చాలా సమస్యగా ఉండేది. వేరే ఊళ్లోకి వెళ్లి ఫోన్ చేయడం లేదంటే.. చెట్లు, గుట్టలు ఎక్కి ఫోన్ చేసేవాళ్లం. ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరు వచ్చి మా ఊళ్లో టవర్ వేయించారు.. ఇప్పుడు మా ఇంట్లో నుంచే ఫోన్లు మాట్లాడుకోవచ్చని ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా.. రియల్ హీరో సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు.

author avatar
Varun G

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju