సౌదీకి చెందిన రహాప్ మహ్మద్ ఆల్ కునున్ (18) అనే యువతి తనకు స్వేచ్ఛగా బతకాలని ఉందంటూ ఇంటినుంచి పారిపోయి రావడంతో ఆ దేశంలో మహిళలపై అమలవుతున్న ఆంక్షల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడాలని నిర్ణయించుకున్న రహాప్ పారిపోయి బ్యాంకాక్ చేరుకుంది. థాయ్ అధికారులు ఆమెను తిరిగి సౌదీ పంపాలని నిర్ణయించడంతో కునున్ బ్యాంకాక్ విమానాశ్రయంలోని హోటల్ గది లోపలకు ఎవరూ రాకుండా తలుపులు బంధించి ఒక వీడియో సందేశం బయటకు పంపింది. తిరిగి వెనక్కువెళితే తన తల్లిదండ్రులు చంపుతారంటూ రహాప్ అందులో పేర్కొన్నది. వైరల్ అయిన ఆ వీడియోతో ఆ యువతి అసహాయత ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చివరకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం జోక్యంతో కథ సుఖాంతం అయింది. ఆమెను స్వదేశం తిరిగి పంపేది లేదని థాయ్లాండ్ ప్రభుత్వం ప్రకటిచింది.
previous post
next post