Sourav Ganguly: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టు కి దూకుడు మొట్టమొదటిసారి పరిచయం చేసిన కెప్టెన్ గంగూలీకి కావడం విశేషం. గంగూలీ మైదానం లో ఎంత గంభీరంగా ఉంటాడో మైదానం అవతల కూడా అదే రీతిలో సెటైర్లు వేస్తూ ఉంటాడు. తన సుదీర్ఘ కెరీర్లో జరిగిన అదిరిపోయే 3 మూడు సంభాషణలు మీకోసం…
ఇది మొదటిది..! ఫ్రెండ్లీగా జరిగినప్పటికీ గంగూలీ లో ఉండే కామెడీ కోణం ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సంఘటన. సరదాగా తన తోటి మాజీ ఇండియన్ ప్లేయర్ గంగూలీ కి ఈ ప్రశ్న వేశాడు. ఈడెన్ గార్డెన్స్ లో సచిన్ ఇంత బాగా ఆడాడు కదా… ఇక కోల్ కతా ప్రేక్షకులు మీ కన్నా అతనినే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారేమో అని అన్నాడు. అందుకు బదులుగా గంగూలీ, “అవును… కానీ అది ఐదు రోజులు మాత్రమే” అని అంటాడు. అలా బెంగాల్ కు ఎప్పుడూ తానే నవాబ్ అని చాటి చెప్పినట్లయింది.
రెండవ సంఘటన…. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ తో గంగూలీ కామెంటరీ ప్యానెల్ లో ఉన్నప్పుడు జరిగింది. క్రికెట్ మ్యాచ్ మధ్యలో సంబంధంలేని టాపిక్ తీసుకొని వచ్చిన నాసిర్ “భారత ఫుట్బాల్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ కి ఎప్పుడు ఎప్పటికి అర్హత సాధిస్తుందో” అని అంటాడు. అందుకు గంగూలీ “భారత్ 50 సంవత్సరాలు గా సాకర్ ప్రపంచకప్ ఆడుతూ ఉంటే కచ్చితంగా ఒక్కసారైనా ఫైనల్స్ చేరుకుని ఉండేది.” అని వెంటనే నాసిర్ నోరు మూయిస్తాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే… క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ దేశంలో అయినప్పటికీ 2019 ప్రపంచ కప్ వరకు ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకోలేదు.
ఇక మూడో సంఘటన కి వచ్చేసరికి…. ఇది లార్డ్స్ మైదానంలో గంగూలీ బాల్కనీలో షర్ట్ విప్పి గాల్లోకి ఎగిరి చెప్పిన సందర్భం నాటిది. ఇంగ్లాండ్ దిగ్గజ ప్లేయర్ బోథమ్ మాట్లాడుతూ అసలు గంగూలీకి ఎటువంటి అనుభవం, స్థాయి ఉన్నాయని లార్డ్స్ వంటి మైదానంలో గెలిచిన ఆనందంలో షర్టు విప్పుతాడు అని ప్రశ్నించాడు.
గంగూలీ ప్రతిగా… “మీ ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా ముంబైలో గెలిచిన తర్వాత త్లాగే సంబరాలు చేసుకున్నాడని గుర్తుచేస్తాడు. అది ముంబై… కానీ ఇది లార్డ్స్. లార్డ్స్ అనేది క్రికెట్ కి మక్కా లాంటిది అని అంటాడు బోథమ్. అందుకు గంభీర్ మీకు లార్డ్స్ మక్కా అయితే ముంబై లోని వాంఖడే స్టేడియం మాకు క్రికెట్ మక్కా ని బదులిస్తాడు.
ఇలా నిన్న గంగూలి 49వ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు ఇటువంటి ఎన్నో విశేషమైన సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.