NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

నైరుతి రుతు పవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఈ రోజు (ఆదివారం) ప్రవేశించాయని .. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు రాయలసీమలోకి ప్రవేశించగా.. అపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి.

రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతు పవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజుల ముందే రుతు పవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఏపీలో అక్కడక్కడ చెదురు మదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పొడి వాతావరణం ఉన్న చోట మాత్రం కొంత ఉక్క పోత ఉండే అవకాశం ఉందన్నారు.

ఈ సారి సకాలంలో దేశమంతా రుతు పవనాలు విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రెమాల్ తుఫాను కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతవరణం ఏర్పడింది. నైరుతి రుతు పవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి త్వరగా తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు కదులుతుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత సంవత్సరం సరైన వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ.. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సారి జూన్ నెల సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కేవలం జూన్ నెల ఒక్క కాకుండా సెప్టెంబర్ వరకూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

దక్షిణాదిన సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుంది. జూన్ – సెప్టెంబర్ అధిక వర్షపాతం నమోదు కావచ్చని తెలుస్తొంది. మరో వైపు రాష్ట్రంలో గత మూడు రోజులుగా తీవ్రమైన ఎండ, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల దాటి అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని  వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతు పవనాలు త్వరగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తుండటంతో ఎండ, వేడి గాలుల నుంచి ఉపశమనం లభించినట్లు అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N