బ్రేకింగ్: మళ్ళీ విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం!

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెలన్నర నుండి చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ సోకడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బాలు ఆరోగ్యం అదే నెల 13న విషమించింది. అప్పటినుండి లైఫ్ సపోర్ట్ మీదే ఉంచుతున్నారు.

 

sp balasubrahmanyam health condition is extremely critical again
sp balasubrahmanyam health condition is extremely critical again

 

అయితే గత కొన్ని రోజులుగా ఎస్పీ బాలు ఆరోగ్యం కుదుటపడుతుంది అంటూ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అప్డేట్స్ ఇస్తున్నారు. బాలు కూర్చుంటున్నారని, ఫిజియోతెరపీలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అయితే ఈరోజు ఎంజిఎం ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయగా, ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమించినట్లు చెబుతున్నారు. గత 24 గంటల నుండి ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. పూర్తి స్థాయి లైఫ్ సపోర్ట్ అవసరమవుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు.