సంక్రాంతికి ప్రత్యేక ఛార్జీల రైళ్లు

Share

హైదరాబాద్, జనవరి 2: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాతి రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 13 ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైలే బుధవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలకు హైదరాబాద్‌కు మధ్య ప్రత్యేక ఛార్జీలు ఉండే సువిధ రైళ్ళు 11 నడపనున్నారు. పండుగ తర్వాత తిరిగి వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్ళలో టిక్కెట్లు అయిపోయే కొద్దీ రేట్లు పెరుగుతుంటాయి.
కాకినాడ టౌన్ స్టేషన్ నుండి సికింద్రాబాద్‌కు ఏడు, నర్సాపూర్ నుండి సికింద్రాబాద్‌కు మూడు, విజయవాడనుంచి సికింద్రాబాద్‌కు ఒకటి నడపనున్నారు. సికింద్రాబాద్‌ నుండి కాకినాడకు రెండు ప్రత్యేక సర్వీసు రైళ్లను ప్రకటించారు. ఈనెల 16,17,20 తెదీల్లో రెండు వంతున, 18న ఒకటీ, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు 18,19,20 తేదీల్లో ఒకొక్కటిగా నడుపుతారు. విజయవాడ-సికింద్రాబాద్‌ల మధ్య 17న ఒక ట్రయిన్, సికింద్రాబాద్-కాకినాడల మధ్య 13,20 తేదీల్లో ఒకొక్కటి నడపనున్నారు.


Share

Related posts

నిధి అగర్వాల్ ని ఇలా చూస్తే నిద్ర పట్టక జాగారం చేసే వాళ్ళు ఎంతమందో ..?

GRK

బిగ్ బాస్ 4: హౌస్ లో టాస్క్ ల విషయంలో విమర్శలు..!!

sekhar

సినీ అభిమానులు నరాలు ఎదురుచూసే రోజు..! కేజీఎఫ్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

Vissu

Leave a Comment