సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయండి!

లోక్ సభ నుంచి సస్పెండ్ చేసిన 45 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. సభలో సభ్యులు నిబంధనలను అతిక్రమించినప్పుడు వారిపై చర్యలు తీసుకునే సర్వాధికారాలూ స్పీకర్ కు ఉన్నాయన్న ఆయన ఇప్పటికే స్పీకర్ వారిని శిక్షించారని పేర్కొన్నారు. సభను స్తంభింపచేసేలా ప్రవర్తించబోమని ఆ సభ్యులు హామీ ఇస్తే స్పీకర్ వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారని తంబిదురై పేర్కొన్నారు.