స్పెషల్ డే ఆఫ్ రతన్ టాటా..! ప్రత్యేకతలివే..!

Share

 

ఒక విలువ.. ఒక విశ్వాసం.. ఒక నాయకత్వం.. వీటన్నిటికి నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా..! దేశంలోకెల్లా చవకైన నానో కార్ రూపకర్త..! ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కోట్లకు అధిపతి.. వ్యాపార సామ్రాజ్యంలో ఆయన స్థాయి వేరు.. బిలియనీర్ అయిన రతన్ టాటా కు మిలియనీర్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.. నేడు 83 వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

 

దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త లో రతన్ టాటా ఒకరు.. ఆయన పాజిటివ్ థింకింగ్ వలన ప్రస్తుతం టాటా గ్రూప్స్ ఈ స్థాయికి చేరింది. గ్రూప్ కార్యకలాపాలను ఎల్లలు దాటి దించడంతోనే కాదు. దేశ పారిశ్రామిక, వాణిజ్య పురోగతిలో కీలక పాత్ర పోషించారు . మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం ఇటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయనని నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. ‘నాకు అలసటగా ఉంది ఈ పని రేపు చేద్దాం ‘ అన్న మాటలు ఆయన నోట విన్నవారు లేరు. ఆయన దృష్టంతా లక్ష్యం పైనే.. గత పదేళ్లలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు వెచ్చించి జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ ఇలాంటి టేట్లే లాంటి సంస్థలను కైవసం చేసుకుని టాటా గ్రూప్లో అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు. ఇంకా 22 కంపెనీ కొనుగోలు చేసి టాటా సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపించింన ఘనత ఆయన సొంతం. రతన్ టాటా ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ , ఒక బ్రాండ్. అన్నిటికీ మించి సృజనాత్మకత, దార్శనికత ,వ్యాపార విలువలు, మంచితనం కలవాడు.

భారతదేశంలో నిరుపేద ఇంటి నుంచి ధనవంతుడు ఇంటి వరకు దైనందిన జీవితంలో ఒక్కటైనా టాటా ఉత్పత్తిని వాడని వారే లేరంటే అంటే అతిశయోక్తి కాదు.. టీ పొడి నుంచి లగ్జరీ కార్ల వరకు టాటా వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.. జెఆర్డి టాటా పోసిన నీరు నేడు మహావృక్షంగా ఎదిగింది. దేశంలో రెండు శాతానికి పైగా కాంట్రిబ్యూషన్ టాటా గ్రూప్ సంస్థలదే. విలువల మీద నడిచే వ్యాపార సామ్రాజ్యం నిర్మించడం, అంతే నిబద్ధతగల టాటా వల్లే ఇది సాధ్యమైంది అనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్లో భాగమై రెండు దశాబ్దాలకు పైబడి గ్రూప్స్ న్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చాడు. ఐబీఎన్ లో ఉద్యోగం వచ్చిన వద్దనుకుని కుటుంబ వ్యాపారమైన టాటా స్టీల్ లో ఉద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం టాటా గ్రూప్స్ 96 వ్యాపారాల్లో ఉంది. 28 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సంస్థలు రతన్ ఉన్నప్పుడే నెలకొల్పడం విశేషం. ఆయన దేశం కోసం చేసిన సేవలకు ఆయనకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. యువతకు ఆదర్శప్రాయుడు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : సోది లవ్ స్టోరీలతో చచ్చిపోయిన ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ న్యూస్…!

arun kanna

బండి సంజ‌య్ నిన్ను ఉరికిచ్చి కొడుత‌రు… నువ్వొక ఊస‌ర‌వెల్లిని

sridhar

Mask’s: మాస్క్ లు ఎప్పటి వరకు పెట్టుకోవాలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..!!

sekhar