NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఎస్బీఐలో స్పెషల్ ఉద్యోగాలు..! పూర్తి వివరాలివే..!

 

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్నీ బ్యాంక్స్ ఉన్నపటికీ ఎస్బీఐ కి ఉన్న ప్రాముఖ్యత మరే బ్యాంకు కు లేదు.. ఇందులో ఉద్యోగం పొందడం నిరుద్యోగుల కల.. ఇందులో ఉద్యోగ భద్రత తో పటు స్పెషల్ అలవెన్స్లు ఉంటాయి .. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషల్ కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ 452 ఖాళీలను సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ విభాగం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది.. పూర్తి వివరాలు ఇలా..

 

 

మొత్తం ఖాళీలు : 452

విభాగాలు :
మేనేజర్, డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్), మేనేజర్(క్రెడిట్ ప్రొసీజర్స్ ), అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఐటి సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్టె, టేక్నికల్ లీడ్ విభాగాలు ఉన్నాయి.

అర్హతలు :

మేనేజర్, డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) :
మార్కెటింగ్ ఫైనాన్స్ లో ఫుల్ టైం ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏ, తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజర్ కు మార్కెటింగ్ సంబంధిత ఫీల్డ్ లో ఐదేళ్లు, డిప్యూటీ మేనేజర్ కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్) :
ఎంబీఏ, తత్సమాన పీజీడీఎం, పీజీడీబీఏ, సిఎఫ్ఎ, ఎఫ్ఆర్ఎం ఉత్తీర్ణత తో ఆరేళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఐటి సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్, టెక్నికల్ లీడ్ :
ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కంప్యూటర్ సైన్స్ లో ఐటిఐ ఈసిఈ లో ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎమ్మేసి కంప్యూటర్ సైన్స్ ,
ఎనిమిదేళ్ల పని అనుభవం ఉండాలి.

మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ స్విచ్చింగ్ స్పెషలిస్ట్) :
కనీసం 60 మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాల్లో సర్టిఫికెట్ కోర్సులు, కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్) :
సీఏ ఉత్తీర్ణతతో పాటు ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి.

ఇంజనీరింగ్ ఫైర్ :
బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత నైపుణ్యాలు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం :
పరీక్ష విధానం :

మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్), ఇంజనీర్ (ఫైర్):
ఈ ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. వీటికి మాత్రం ఇంటర్వ్యూ ద్వారా నియామకం జరుగుతుంది. ప్రతిభ ఆధారం గా తుది ఎంపిక జరుగుతుంది .

మేనేజర్ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) :
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సమయం 2గంటలు. ఈ పరీక్షను ఆన్లైన్ బ్యాంకింగ్ ఎగ్జామ్ తరహాలో నిర్వహిస్తారు. రెండొవ విభాగంలో లెటర్ రైట్టింగ్, ఎస్సై లకు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయిన వారికి 100 మార్కుల ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకం చేపడతారు.

అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్), డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్), అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్),అప్లికేషన్ ఆర్కిటెక్, ప్రాజెక్ట్ మేనేజర్ టెక్నికల్ లీడ్ , ఐటి సెక్యూరిటీ ఎక్స్పర్ట్ :
ఈ రాత పరీక్షలో 120 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి 150 మార్కుల ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ,నెట్వర్క్ అండ్ స్విచ్ స్పెషలిస్ట్):
దీనిని కూడా రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. 80 ప్రశ్నలను 100 మార్కులకు నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధి ఉంటుంది. ఇందులో 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హత సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకం జరుగుతుంది.

డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్) ;
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. 120 ప్రశ్నలకుగాను 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 25 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండింటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఫీజు : రూ.750/- (ఎస్సీ, ఎస్టీ, PWD వారికి మినహాయింపు.)
దరఖాస్తులకు చివరి తేదీ : 11/2/2021
ఆన్ లైన్ రాత పరీక్షలు : 2021 ఫిబ్రవరి 1,7 తేదీలలో
వెబ్సైట్ : https://www.sbi.co.in.

author avatar
bharani jella

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju