Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఓ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నాడు సూర్య. త్వరలో ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. కాగా ఆడుకళం, విసరణై, వడ చెన్నై, అసురన్ బ్లాక్ బస్టర్స్ తీసి పలు అవార్డులు దక్కించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రీ మారన్ తో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుదని సమాచారం.
కాగా ఈ సినిమాకి ‘వాడి వాసల్’ అనే టైటిల్ తో తెరకెక్కబోతోంది. గత సంవత్సరం ప్రకటించిన ఈ సినిమాని అప్పుడే సెట్స్ మీదకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి ఇదుగో అదుగో అంటూ వార్తలు వస్తున్నాయి గాని అధికారకంగా మాత్రం షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టనున్నారో వెల్లడించలేదు. ఇక ఎట్టకేలకి ‘వాడి వాసల్’ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారట. కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ‘వాడీ వాసల్’ సినిమాను సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని సూర్య-వేట్రి మారన్ ప్లాన్ చేస్తున్నారట.
Surya : ఎద్దులతో లైవ్ గా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
దీన్ని దృష్ఠిలో పెట్టుకొనే సూర్య – వెట్రీ మారన్ పక్కాగా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా కథా నేపథ్యం ప్రకారం సూర్య తన పాత్ర కోసం మానసికంగా గానూ, శారీరకంగానూ సిద్దమవుతున్నారట. జల్లి కట్టు ఉత్సవాల బ్యాక్ డ్రాప్ లో ‘వాడీ వాసల్’ రూపొందనుంది కాబట్టి సూర్య జల్లికట్టు సన్నివేశాలలో ఎక్కువగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఇందులో ఎద్దులతో ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఈ పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎద్దులతో లైవ్ గా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.