Special trains:తెలుగు వారి పెద్ద పండగలలో సంక్రాంతి పండగ కూడా ఒకటి. సంక్రాతి పండగకు సొంత ఊళ్ళకు వచ్చేందుకు వివిధ ప్రాంతాల వారు ఎక్కడెక్కడినుంచో తరలివస్తారు. చుట్టాలతో ఇల్లంతా సందడి సందడిగా మారిపోతుంది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు అందరు శెలవులు పెట్టుకుని మరి తమ సొంత ఊళ్లకు పయనం అవుతారు. అందుకే సంక్రాంతికి ముందు రోజుల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు అన్ని కూడా రద్దీగా ఉంటాయి. ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడతాయి.
Bigg Boss 6 Telugu: మీరు కూడా “బిగ్ బాస్ 6” కి వెళ్ళాలి అనుకుంటున్నారా, వెంటనే ఇలా చేయండి !
Special trains: ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ :
అందుకనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీలోని ఇతర స్టేషన్ల వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మరి ఏఏ రూట్స్ లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయో తెలుసుకుందామా..
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కి ఎంపికైనా సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ ? అతనితో పాటు ఇంకొక సర్ప్రైజ్
కాచిగూడ, లింగంపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు తెలిపింది. అలాగే మచిలిపట్నం నుంచి కర్నూలు సిటీకి, కర్నూలు నుంచి మచిలిపట్నంకు,తిరుపతి నుంచి నాందేడ్, కాకినాడ నుంచి లింగంపల్లి, లింగంపల్లి టు కాకినాడ, నర్సాపూర్-సికింద్రాబాద్ కు సైతం ప్రత్యేక రైళ్లను వేశారు.
రైళ్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్-కాచిగూడ, మచిలిపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్- మచిలిపట్నం, తిరుపతి-అకోలా, అకోలా- తిరుపతి, పూర్ణ-తిరుపతి, తిరుపతి – పూర్ణం, కాచిగూడ- కొల్లం, కొల్లం-కాచిగూడ, సికింద్రాబాద్-కొల్లం, కొల్లం – సికింద్రాబాద్ ఇలా చాలా ప్రాంతాలకు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలని ముందు జాగ్రత్త కోసం ఇలా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు. అలాగే ప్రయాణికులు కూడా కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?