హాయ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిఖిత. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. సంబరం, ఖుషీఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, కళ్యాణ రాముడు ఇలా వరుసగా అవకాశం వచ్చిన సినిమాలన్ని చేసింది. కానీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయింది. హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్నప్పటికి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిలవలేకపోయింది.
తెలుగులోనే కాదు…దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించింది నిఖిత. ప్రేక్షకుల తో పాటు మేకర్స్ దృష్ఠిని బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలను దక్కించుకుంది. చేతినిండా సినిమాలు…మంచి మంచి అవకాశాలు దక్కడంతో…ఇండస్ట్రీలో దూసుకుపోయిన్ది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే నిఖిత చేసిన ఒకే ఒక్క మిస్టేక్ వల్ల పూర్తి సినీ కెరీర్‌నే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓ ప్రముఖ కన్నడ హీరోతో నిఖిత కొనసాగించిన ప్రేమాయణమే తన కొంప ముంచిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. వరసగా సినిమాలు మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమయంలో నిఖిత తప్పటడుగు వేసింది. అప్పటికే సదరు ఆహీరోకి పెళ్లికావడం .. అతనికి కొడుకు కూడా ఉండటంతోనే ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక సదరు హీరో భార్యకు అసలు విషయం తెలిసి నానా రచ్చ చేసింది. తన కాపురంలో నిప్పులు పోసిందంటూ…ఏకంగా హీరో భార్య నికితపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేసిందట. ఈ వివాదంతో పోలీసులు ఆ హీరోను అరెస్ట్ కూడా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతో అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు నిఖితను ఎవరూ సినిమాల్లో తీసుకోకూడదంటూ కన్నడ ఇండస్ట్రీ బహిష్కరించింది. వరుస సినిమాలతో జోరుమీదున్న నిఖిత ఒక్కసారిగా అవకాశాలు లేకపోవడంతో మనస్థాపనకు గురైందట. సినిమాలపై దృష్టి పెట్ట లేకపోయింది. దీంతో సినీ కెరీర్ కి గుడ్‌బై చెప్పి పర్సనల్ లైఫ్‌పై దృష్టి సారించింది. 2016లో గగన్ దీప్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప ఉంది. ప్రస్తుతం నిఖిత సంతోషంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి స్టార్ హీరోయిన్ గా కొనసాగాల్సిన నిఖిత కెరీర్ ఇలా మలుపు తిరిగింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!