ఆలోచించకుండా నాగ్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఆ డైరెక్టర్ కెరీర్ నే మార్చేసింది..!

అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన బ్యానర్ లో కొత్త వాళ్ళకి ఇచ్చినన్ని అవకాశాలు ఇండస్ట్రీలో మరెవరూ ఇచ్చి ఉండరు. అనుభవం కాదు ముఖ్యం టాలెంట్.. సినిమాని తీయగల దమ్ము ఉందంటే చాలు నాగార్జున దర్శకుడిగా అవకాశం ఇచ్చేస్తారు. అలా ఇచ్చిన వాళ్ళలో రాం గోపాల్ వర్మ దగ్గర నుంచి ప్రముఖ కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్, అమ్మ రాజ శేఖర్, రాహుల్ రవీంద్రన్ లాంటి ఎంతో మంది ఉన్నారు.

Nagarjuna resumes 'Wild Dog' shooting after being in lockdown for months, shares BTS video - Republic World

హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉదాహరణ గా చెప్పాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్.. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి నాగ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చేశారు నాగ్. ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా పని చేసిన అహిసూర్ సాలమన్ దర్శకత్వం‌లో ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అన్న సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్ళీ ప్రారంభం అయింది.

అయితే పేపర్లలో చూసిన న్యూస్ ఆధారంగా అహిసూర్ సాలమన్ ఒక స్టోరీ రెడీ చేసుకున్నారట. ఆ స్టోరీ ని నిర్మాత నిరంజన్ రెడ్డికి వినిపించగా, రెండు నెలల తరువాత ఫోన్ చేసి నాగార్జునకి కథ చెప్పామన్నారట. నాగ్ ని కలిసి వన్ లైన్‌లో స్టోరీ చెప్పాడు. దానికి నాగ్ అదిరిపోయే సూచనలు ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సాలమన్ వెల్లడించాడు. కేవలం రెండు సిట్టింగుల్లోనే స్టోరీని నాగ్ ఓకే చేసి సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారట. మొత్తానికి టాలెంట్ ని పసిగట్టి ఏమాత్రం ఆలోచించకుండా నాగ్ తీసుకున్న డెసిషన్ తో ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు.

టాలెంట్ ఉంటే నాగ్ ఖచ్చితంగా అవకాశం ఇస్తారనడానికి ఇప్పుడు అహిసూర్ సాలమన్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక నాగ్ ఈ సినిమా తో పాటు ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే త్వరలో తన తాజా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అధికారక ప్రకటనలు వెలువడనున్నాయని సమచారం.