ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు

గుంటూరు, డిసెంబర్ 31 : గుంటూరు బ్రహ్మనంద స్టేడియంలో మూడు కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంను సోమవారం మంత్రులు పత్తిపాటి పుల్లరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు. స్టేడియం అభివృద్ధికి ఒక కమిటీని నియమించామని, పీపీ పద్ధతిలో స్టేడియంను అధ్భుతమైన క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతామని మంత్రి పత్తిపాటి పుల్లరావు తెలిపారు. సీఎం చంద్రబాబు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ రెండు నుండి మూడు కోట్ల వ్యయంతో ఎన్‌టిఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ జనవరిలో జరగనున్న జన్మభూమి కార్యక్రమాల్లో రేషన్ కార్డులను పింపణీ చేస్తామని మంత్రి పత్తిపాటి అన్నారు.