NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

S R Kalyana Mandapam Review: SR కళ్యాణ మండపం మూవీ రివ్యూ

SR Kalyanamandapam review

S R Kalyana Mandapam Review: ‘రాజా వారు రాణి గారు’ మూవీ తో 2019లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన రెండవ సినిమా ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ ఈ రోజు విడుదలైంది. మొదటిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న శ్రీధర్ గడె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఆంధ్ర అమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ పాత్ర పోషించగా విలక్షణ నటుడు సాయి కుమార్ హీరో తండ్రి పాత్రలో మెరిపించారు. మరి ఈరోజు థియేటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

 

SR Kalyanamandapam review

S R Kalyana Mandapam Review: కథ

కడప జిల్లా రాయచోటి లో ‘ఎస్ ఆర్’ అనే కళ్యాణమండపం ఓనర్ ధర్మ (సాయి కుమార్), కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) చుట్టూ జరిగే చిత్రమే ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’. పుట్టుకతోనే ధనవంతుడైన ధర్మ వ్యాపారం లో డబ్బు అంతా పోగొట్టుకున్నాడు. ఊరి జనమంతా అతని తండ్రి, తాతలు సాధించిన కీర్తి, సంపాదించిన డబ్బుని కొనసాగించలేకపోయాడు అని అతనిని తక్కువచేసి చూస్తుంటారు. దీంతో ధర్మ కొడుకు కళ్యాణ్, ధర్మ భార్య కూడా అతనంటే పెద్దగా లెక్క చేయరు. అయితే తర్వాత చెడిపోయిన తండ్రి కొడుకుల సంబంధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అసలు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమిటి? చివరికి వీరి బంధం బలం అవుతుందా లేదా పూర్తిగా విడిపోతుందా…? అన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

  • సినిమా మొదటి అర్ధ భాగంలో కామెడీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అయ్యేలా పంచ్ లు, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సన్నివేశాలతో ఎంతో ఎంటర్టైనింగ్ గా తీశారు.
  • సినిమా స్టోరీ లైన్ కూడా బాగుంది. ఎంతోమంది యూత్ అనునయించుకునే కథాంశంతో తండ్రీకొడుకుల మధ్య ఎప్పుడూ ఉండే భావోద్వేగాలు ఉన్న ఈ కథ ఆడియన్స్ కు త్వరగా కనెక్ట్ అవుతుంది.
  • సినిమాలోని డైలాగులు అన్నీ మెచ్చుకోలుగా ఉన్నాయి. అలాగే సాయి కుమార్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇవ్వగా కిరణ్ తన రెండో సినిమా చేస్తున్నట్లు కనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న వాడిలా ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు.
  • సినిమాలోని క్లైమాక్స్ చాలా బాగా చిత్రీకరించారు. ఆ స్థాయిలో ఎమోషన్స్ పండించాలంటే కొత్త డైరెక్టర్ కు కత్తి మీద సాము అవుతుంది. అయితే శ్రీధర్ మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధం ఎంతో బాగా చూపించి సినిమాను బాగా ముగించారు.

మైనస్ పాయింట్స్

  • సినిమాలో రెండవ భాగం లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొదటి అర్ధ భాగంలో కామెడీతో స్టోరీ బేస్ లైన్ బాగా సెట్ చేసిన డైరెక్టర్… రెండో అర్ధ భాగంలో మాత్రం తేలిపోయాడు.
  • ప్రధాన తారాగణం తప్ప సపోర్టింగ్ క్యారెక్టర్ లకు ఎంపిక చేసిన నటులు పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. కాస్టింగ్ విభాగం ఘోరంగా విఫలం అయింది.
  • ఎంత లోతుగా ఉండే స్టోరీలైన్ తీసుకొని తండ్రీకొడుకుల సంబంధాన్ని అటు ఎంటర్టైనింగ్ గా ఇటు ఎమోషనల్ గా చూపించేటప్పుడు అందుకు అవసరమైన బలమైన సీన్లు ఈ చిత్రంలో కరువయ్యాయి. రొటీన్ స్క్రీన్ప్లేతో ప్రేక్షకులు కొద్దిగా అసంతృప్తికి లోనవుతారు.

SR Kalyanamandapam review

S R Kalyana Mandapam Review: విశ్లేషణ

“ఎస్ ఆర్ కళ్యాణమండపం” మొదటి అర్ధ భాగం ఎంతో బాగుంది. లాక్డౌన్ వల్ల థియేటర్లకు మొహం వాచిన అందరికీ ఫస్ట్ హాఫ్ ఎంతో రిలీఫ్ ఇస్తుంది. అయితే రెండవ అర్ధ భాగం ఇందులో సగం ఉన్నట్లైతే సినిమా బంపర్ హిట్ అయ్యింది. కాకపోతే రెండవ అర్ధ భాగం బాగా రొటీన్ గా, ఆసక్తికరమైన అంశాలు లేకపోవడంతో సినిమా అక్కడే ఫ్లో కోల్పోయింది. సాయికుమార్ పర్ఫామెన్స్, అతని క్యారెక్టర్ చాలా బాగుంది. తండ్రి కొడుకుల సంబంధం పైన సీన్లు కొద్దిగా వర్కౌట్ అయ్యాయి. అయితే నరేషన్ విషయంలో డైరెక్టర్ తడబడడం సినిమాను దెబ్బతీసే అంశం. కానీ ఈ చిత్రానికి యూత్ ని బాగా ఆకట్టుకునే కెపాసిటీ ఉంది. మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ను ఆశించడం అత్యాశే అవుతుంది కానీ చిన్న నగరాల్లో మాత్రం ఈ సినిమా బాగా వర్కౌట్ అవ్వచ్చు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా అలా సరదాగా ఈ వీకెండ్ థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. అది మాత్రం గ్యారంటీ.

చివరి మాట: “ఎస్.సార్” కళ్యాణ మండపం

author avatar
arun kanna

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri