Sreeja Kalyan: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయారని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు చేస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ లలో జరిగే మార్పులను అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. సెలబ్రిటీల జీవితాలపై సోషల్ మీడియాలో ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు నాగ చైతన్య, సమంతల మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వార్తలు ఇచ్చాయి. చివరకు వాళ్లే తాము ఇష్టపూర్వకంగా విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నామని సోషల్ మీడియా వేదికపై ప్రకటించారు. అయినప్పటికీ వాళ్ల విడాకుల సంబంధించిన వార్తలను ఇంకా ఇస్తూనే ఉన్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య – ధనుష్ లు విడిపోతున్న విషయంపైనా సోషల్ మీడియా ఫోకస్ పెట్టింది. మరో పక్క చిరంజీవి కుమార్తె శ్రీజ – కళ్యాణ్ దేవ్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి. అందుకు శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన మార్పులను చూపుతూ ఇదిగో ఫ్రూవ్ అంటూ కథనాలు ఇస్తున్నాయి.
Sreeja Kalyan: కళ్యాణ్ దేవ్ ఏమంటున్నారంటే..?
ఈ వార్తలపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సన్నిహితుల వద్ద స్పందించినట్లు సమాచారం. పర్సనల్ జీవితాలకు సంబంధించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట. కుటుంబాల్లో జరిగే విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదని అతని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారుట. సెలబ్రిటీల అంతర్గత విషయాలపై మీడియా ఫోకస్ పెట్టి రచ్చచేయడం, మనోభావాల ను దెబ్బతీసేలా రాయడం మంచిది కాదన్నారుట. ఆయన అన్నట్లుగానే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి పర్సన్ విషయాలను బూతద్దంలో పెట్టి చూపుతున్నాయి.