Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఏది చేసిన రచ్చే. రచ్చ రంబోలానే. అదే ఆమె స్టయిల్. యాంకర్ శ్రీముఖి అంటేనే తెలుగు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ వేరు. జస్ట్ మిస్ లో బిగ్ బాస్ 3 కిరీటాన్ని మిస్ చేసుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ హౌస్ లో తను మిగితా కంటెస్టెంట్లకు ఎంత టఫ్ పోటీ ఇచ్చిందో అందరికీ తెలుసు. అందుకే శ్రీముఖికి తెలుగు ఇండస్ట్రీలో అంత పాపులారిటీ. తను ఏ విషయం గురించైనా చాలా క్లారిటీతో, తను ఏం చెప్పాలనుకుందో చెప్పేస్తుంది.

ప్రస్తుతం టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి.. సపరేట్ గా యూట్యూబ్ చానెల్ కూడా ఏర్పాటు చేసుకుంది. దాంట్లో తన పర్సనల్ వీడియోలను పోస్ట్ చేస్తోంది.
ఇటీవల గోవా వెళ్లిన వీడియోలను కూడా పోస్ట్ చేసింది శ్రీముఖి. త్వరలో హోళీ రానున్న సందర్భంగా హోళీ ఈవెంట్ లో పాల్గొన్నది శ్రీముఖి. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది.
తన హోళీ షూట్ లో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. హోళీ ఈవెంట్ కోసం వైట్ అండ్ వైట్ చుడిదార్ వేసుకొని డ్యాన్స్ వేసి అదరగొట్టింది.
Sreemukhi : వైట్ అండ్ వైట్ లో ముద్దుగుమ్మలా ఉన్న శ్రీముఖి
అయితే… వైట్ అండ్ వైట్ డ్రెస్ లో శ్రీముఖి ముద్దుగుమ్మలా ఉంది. హోళీ వేడుకల కోసం సూపర్బ్ గా రెడీ అయి తన అభిమానులను సంతోషపరిచింది శ్రీముఖి. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.