Sreemukhi : బిగ్ బాస్ సీజన్ త్రీ టైటిల్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని అందరికీ తెలుసు. అదే సీజన్లో రన్నరప్ గా శ్రీముఖి నిలవటం జరిగింది. హౌస్ లో ఇద్దరి మధ్య నువ్వానేనా అన్న వాతావరణం అప్పట్లో ఉండేది. ఎలిమినేషన్ వచ్చిన ప్రతిసారి శ్రీముఖి రాహుల్ ని ఎలిమినేట్ చేయడం మాత్రమే కాక గేమ్ లో ప్రతిసారి రాహుల్ ని కార్నర్ చేస్తూ శ్రీముఖి ఆడిన గేమ్ ఒక విధంగా రాహుల్ కి బాగా కలిసి వచ్చిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో దాదాపు రెండుసార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన రాహుల్ చివరాకరికి విజేత గా హౌస్ నుండి బయటకు రావడం జరిగింది.
బిగ్ బాస్ హౌస్ లో Sreemukhi
హౌస్ నుండి ఆ సీజన్ లో గేమ్ ఆడిన చాలామంది కంటెస్టెంట్ లు బయట కలుసుకున్నారని రాహుల్ శ్రీముఖి కలిసిన సందర్భాలు చాలా తక్కువ. బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి మధ్య జరిగిన వార్ బయట కూడా కోల్డ్ వార్ గా కంటిన్యూ అయ్యింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్ విన్నర్ గా బయట మంచి పాపులారిటీ సంపాదించిన రాహుల్.. తనతో పాటు హౌస్ లో ఆడిన ప్రతి ఒక్కరితో బయట అనేక షోలలో పాల్గొనడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా “స్టార్ మా” లో బిగ్ బాస్ రియూనియన్ పేరిట జరుగుతున్న కార్యక్రమంలో బిగ్ బాస్ గత 3 సీజన్ లకి చెందిన కంటెస్టెంట్ లని ఒకచోట ఉత్సవం పేరిట ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కి యాంకర్ గా శ్రీముఖి చేస్తూ ఉంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చేదు అనుభవాలు ఎవరితోనైనా ఎవరికైనా ఇంకా బయట ఉంటే మంటల్లో వేసి కాల్చేయండి.. కొత్తగా మళ్లీ ప్రారంభించండని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
అలా చెబుతూ మొదటగా తానే కొన్ని విషయాలను బయటపెట్టేసింది. ఈ నేపథ్యంలో హౌస్ లో ఉన్న సమయంలో అదేవిధంగా బయటకు వచ్చాక కూడా రాహుల్ తో ఉన్న కోల్డ్ వార్ విషయానికి స్వస్తి పలికేలా డెసిషన్ తీసుకోవడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటివరకు రాహుల్‌తో తనకు ఉన్న చేదు అనుభవాలన్నింటిని మంటల్లో కాల్చేస్తున్నా.. ఇకపై మంచి ఫ్రెండ్స్‌లా ఉండేందుకు ప్రయత్నిస్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. వచ్చేవారం బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమం లో ఈ సీన్ కనువిందు చేయనుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!