Sreemukhi : శ్రీముఖి Sreemukhi గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తనేంటో అందరికీ తెలుసు. తను యాంకరింగ్ చేసిందంటే ఇక మామూలుగా ఉండదు. రచ్చ రంబోలానే. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. వాళ్లకు సరైన సమాధానం చెప్పగల సత్తా ఉంది తనకు. చూడటానికి కాస్త అమాయకంగా కనిపించినా.. శ్రీముఖిని తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. తను మాట్లాడితేనే అరిచినట్టుగా ఉంటుంది. ఇక తను అరిస్తే.. చుట్టు పక్కన ఎవ్వరూ ఉండరు. ప్రస్తుతం బుల్లితెర మీద తను టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.
ఇటీవల బీబీఉత్సవం అనే ప్రోగ్రామ్ స్టార్ మాలో ప్రసారం అయింది గుర్తుందా మీకు. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరు కలిసి చేసిన హంగామా అది. ఆ షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది.
తాజాగా బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ 3 వరకు మూడు సీజన్ల కంటెస్టెంట్లను పిలిచి.. ప్రోగ్రామ్ ను కండక్ట్ చేశారు. అది బీబీఉత్సవం పార్ట్ 2 అన్నమాట.
బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మూడో సీజన్ వరకు పాల్గొన్న కంటెస్టెంట్లు అంతా ఈ ప్రోగ్రామ్ కు వచ్చి తెగ సందడి చేశారు. అఫ్ కోర్స్ ఈ షోకు కూడా శ్రీముఖినే హోస్ట్. అలాగే తను కూడా కంటెస్టెంట్ కాబట్టి.. రెండు విధాలుగా కలిసి వచ్చింది.
Sreemukhi : బిగ్ బాస్ రోహిణిపై సెటైర్లు వేసిన శ్రీముఖి
అయితే.. ఈ సందర్భంగా శ్రీముఖి.. బిగ్ బాస్ రోహిణిపై సెటైర్లు వేసింది. రోహిణీ నువ్వేంటి? ఇంట్లో ఉన్నప్పుడు చికెన్ రోల్ లా ఉండేదానివి. ఇప్పుడేంటి.. రుబ్బు రోలులా తయారయ్యావు.. అంటూ సెటైర్ వేయగానే.. రోహిణి ఏమాత్రం తడుముకోకుండా… నువ్వు మాత్రం అస్సలు మారలేదు. అక్కడా రుబ్బు రోలే.. ఇక్కడా రుబ్బు రోలే.. అంటూ డైరెక్ట్ పంచ్ ఇవ్వడంతో శ్రీముఖికి ఏం చేయాల్నో అర్థం కాలేదు.
ఏది ఏమైనా.. వీళ్లకు ఇలా ఇంత స్పాంటెనిటీగా పంచులు ఎలా వస్తాయో అర్థం కాదు. మొత్తానికి బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటెస్టెంట్లు, విన్నర్స్ అంతా ఒకేచోట కలిసి సందడి చేస్తే ఎలా ఉంటదో ఈ ప్రోమోలో చూడండి. ఫుల్ ఎపిసోడ్ కావాలంటే.. ఫిబ్రవరి 14 దాకా ఆగాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?