Sreemukhi : శ్రీముఖి Sreemukhi తెలుసు కదా. యాంకర్ గా ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న శ్రీముఖి ఎక్కడ కనిపించినా అందరూ ముందు అడిగే ప్రశ్న ఒక్కటే. ఏమ్మా.. ఎప్పుడు పెళ్లి.. నీ తోటి వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు కూడా చేసుకుంటున్నారు. నీ పెళ్లి ఎప్పుడూ అంటూ అందరూ శ్రీముఖిని అడిగి అడిగి తనకు విసుగు తెప్పిస్తున్నారు. నిజానికి.. పెళ్లి ఈడు వచ్చిన వాళ్లు ఎవరికైనా ఉండే సమస్యే ఇది. అది అందరికీ కామనే కానీ.. అసలు విషయం ఏంటంటే.. శ్రీముఖి ఓ విషయం గురించి తాజాగా పోస్ట్ పెట్టింది.
Sreemukhi : వాలంటైన్స్ డే రోజున సర్ ప్రైజ్ అంటూ పోస్టు?
వాలంటైన్స్ డే రోజున నా అభిమానులందరికీ ఓ విషయం చెప్పబోతున్నా. అది సర్ ప్రైజ్, సస్పెన్స్. ఆరోజు రివీల్ చేస్తా? అందరూ సిద్ధంగా ఉండండి.. అంటూ తన యూట్యూబ్ చానెల్ లో ఓ పోస్ట్ పెట్టింది శ్రీముఖి.
వాలంటైన్స్ డే రోజున శ్రీముఖి ఒక ముఖ్యమైన విషయం.. అది కూడా ఎంతో ఎగ్జయిట్ అవుతూ పోస్ట్ పెట్టింది అంటే ఇంకేం ఉంటుంది.. నో డౌట్.. తనకు కాబోయే వాడి గురించే అయి ఉంటుంది. అసలే.. వాలంటైన్స్ డే.. ఇంకేముంది ప్రేమికుల దినోత్సవం రోజున ఏ న్యూస్ చెబుతారు.. తనకు కాబోయే వాడి గురించే కదా. కంగ్రాట్స్ శ్రీముఖి.. మొత్తానికి ఒక ఇంటి దానివి అవబోతున్నావు.. అంటూ నెటిజన్లు, తన అభిమానులు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
ఒకవేళ తన పెళ్లి గురించి వార్త అయితే.. ఆ అబ్బాయి ఎవరు? సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనా? లేక బయటి వ్యక్తితోనా? లవ్ మ్యారేజా? లేక అరేంజ్ డా? ఏంటి.. అసలు.. శ్రీముఖి ఏం చెప్పాలనుకుంటోంది? అంటూ సవాలక్ష డౌట్లతో తన అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు గొడవ.. ఇంకా ఒక్క రోజే కదా. తను ఏం చెబుతుందో చూద్దాం.