Sreemukhi: తెలుగు బుల్లితెరపై టాప్ యాంకరింగ్ చేస్తూ భారీ క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి. పటాస్ షో లో రాములమ్మ గా శ్రీముఖి అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను భారీగా ఎంటర్టైన్ చేయడం జరిగింది. పటాస్ షో భారీగా హిట్టవడంతో.. అప్పట్లో శ్రీముఖి పేరు ఇండస్ట్రీ లో మారు మ్రోగుతూ ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీముఖి కి.. అప్పట్లో ఆమె బిగ్ బాస్ హౌస్ లో వ్యవహరించిన తీరుపై బయట కొంత నెగిటివిటీ ఏర్పడింది.
ఇక ఇదే తరుణంలో… శ్రీముఖి కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అవకాశాలు కూడా గతంలో కంటే కొద్దిగా తగ్గటం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే.. శ్రీముఖి తన లవ్ బ్రేక్ అప్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి తోనే లవ్లో ఉన్నట్లు బ్రేకప్ అయినట్లు అప్పట్లో కెరియర్ పరంగా.. చాలా డిప్రెషన్ కి వెళ్లినట్లు.. ఆ తర్వాత తిరిగి పుంజుకుని కెరీర్ పరంగా పైకి వచ్చినట్లు స్పష్టం చేసింది.
Read more: SreeMuki Beautiful Pics
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు శ్రీముఖి అభిమానులకు టచ్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటూ శ్రీముఖి కి ప్రశ్న వేయడం జరిగింది. దానికి శ్రీముఖి ఆ నెటిజన్ కి.. ఈ రీతిగా జవాబు ఇస్తూ జనాలని త్వరగా నమ్మటం… ప్రేమించడం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీముఖి ఇచ్చిన ఆన్సర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.