న్యూస్ ప్ర‌పంచం

Sri Lanka Court: మాజీ ప్రధాని మహింద రాజపక్సకు బిగ్ షాక్ ఇచ్చిన శ్రీలంక కోర్టు

Share

Sri Lanka Court: మాజీ ప్రధాని మహింద రాజపక్స కు శ్రీలంక కోర్టు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఆందోళనకారులకు భయపడి తన కుటుంబం, అనుచరగరణంతో నేవీ బేస్ లో తలదాచుకున్నారు. అవకాశం చిక్కితే దేశం విడిచి వెళ్లిపోవాలని మహింద రాజపక్స చూస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని కొలంబోలోని కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.  మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్, రాజపక్స మిత్ర పక్షాలకు చెందిన 12 మంది సభ్యులు దేశం విడిచి వెళ్లడాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై జరిగిన దాడులు, ఆ తర్వాత చెలరేగిన హింసపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు.

Sri Lanka Court foreign travel ban on EX PM Mahinda Rajapaksa
Sri Lanka Court foreign travel ban on EX PM Mahinda Rajapaksa

Sri Lanka Court: కొనసాగుతున్న ఉద్రిక్తత

ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా చేసినా శ్రీలంకలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహీంద్ర రాజపక్స అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధాని అధికారిక నివాసంపై నిరసనకారులు దాడి చేయడంతో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నిరసనకారుల కాల్చివేత ఉత్తర్వులతో భద్రతా బలగాలు, ఆయుధ వాహనాలు దేశమంతా గస్తీ కాస్తున్నాయి. రాజపక్స మద్దతుదారులు, నిరసనకారుల మధ్య చెలరేగిన హింసతో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు.


Share

Related posts

ఆ ఎమ్మెల్యే కు మాట్లాడటం చేతకాదా ? ప్రతిసారి వివాదమే

Special Bureau

Twist In Wedding: అన్నతో నిశ్చితార్ధం..! తమ్ముడితో పెళ్లి..! వివాహ వేడుకలో ట్విస్ట్..!!

somaraju sharma

Maharastra; ఆ బీజేపీ ఎంపీ బిక్షాటన ఎందుకంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar