న్యూస్

Sri Reddy: మెగాస్టార్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణ!వెనక ఏదో ఉండే ఉంటుందని టాలీవుడ్ అనుమానం!!

Share

Sri Reddy: ఎవరినైనా సరే నోటికొచ్చినట్టు తిట్టేసి, సంచలనాత్మక ప్రకటనలు చేసి ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి శ్రీరెడ్డి లో ఇన్నాళ్లకు పాజిటివ్ వైబ్రేషన్ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇది శ్రీరెడ్డి లో మరో కోణమని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

Sri Reddy apologizes to megastar's mother!
Sri Reddy apologizes to megastar’s mother!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బండారాన్ని బయటపెట్టి,తనకు న్యాయం చేయమంటూ జనాల ఎదుటే అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసిన ఈ డాషింగ్ అండ్ డేరింగ్ అమ్మడు అప్పటి నుండి అదే పంథా కొనసాగిస్తూ వస్తోంది.తాజాగా నేచురల్ స్టార్ నానిని కూడా టార్గెట్ చేసింది.సరే.. ఇది ఆమె స్టయిల్ అనుకుని సరిపెట్టుకుంటున్న టాలీవుడ్ ప్రముఖులను దిగ్భ్రాంతి పరిచేలా శ్రీరెడ్డి శనివారం మరో మిస్సైల్ విసిరింది.

Sri Reddy: మెగాస్టార్ తల్లికి క్షమాపణలు!

మొట్టమొదటిసారిగా శ్రీరెడ్డి నోట సారీ అనే పదం వినిపించింది.మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మకు ఆమె ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది.దీంతో సినీ రంగ దిగ్గజాలు గుక్కతిప్పుకోలేకున్నాయి.రీసెంట్ గా అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీరెడ్డి హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్‌ని దర్శించుకున్నారు. ఈ సందర్భంలో అమ్మ వారి సాక్షిగా చిరంజీవి తల్లి అంజనా దేవికి ఆమె క్షమాపణ చెప్పింది.

ఎందుకీ క్షమాపణ అంటే!

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఉధృతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో శ్రీరెడ్డి వ్యవహారశైలిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆక్షేపించినట్లు వార్తలు రావడంతో ఆమె రెచ్చిపోయి మెగా బ్రదర్ తల్లి అంజనాదేవిని తీవ్ర పదజాలంతో దూషించింది.అప్పట్లో ఇది పెను దుమారం రేపింది.అయినా ఆనాడు దిగిరాని శ్రీరెడ్డి చాలాకాలం తర్వాత దాదాపు ఆ ఇష్యూ మరుగున పడిపోయాక మన్నించమంటూ చిరంజీవి తల్లిని ప్రాధేయపడడం జరిగింది.

Sri Reddy: ఆర్జీవీని ఇరికించిన శ్రీరెడ్డి!

ఈ వ్యవహారంలో రాంగోపాల్ వర్మను శ్రీరెడ్డి ఇరికించేసింది. వర్మ పేరు చెప్పనప్పటికీ తనకు ఆనాడు అండగా ఉన్న ఒక పెద్దమనిషి ఇచ్చిన తప్పుడు సలహాతోనే తాను చిరంజీవిగారి తల్లిని తిట్టానని,ఇది ముమ్మాటికీ తప్పేనని శ్రీరెడ్డి అంగీకరించారు. ఉద్యమం సాగించిన సమయంలో శ్రీ రెడ్డికి రాంగోపాల్ వర్మే అండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.కాబట్టి ఆమె వర్మను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

శ్రీరెడ్డి ఏం చెప్పిందంటే!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఆడవాళ్ల కోసం చేసే ఉద్యమానికి న్యాయం జరగాలంటే ఒక ఆడదాన్ని తిట్టాలని ఒక పెద్ద మనిషి నా బ్రెయిన్ వాష్ చేసి అతని పంతం కోసం నన్ను ఉపయోగించుకున్నాడు. అతనికి చిరంజీవికి ఎలాంటి తగాదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ.. చిరంజీవి కుటుంబం తరలివస్తుందని ఈ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో నేను అమాయకురాలైన అమ్మని తిట్టాను.ఈ ఇష్యూతో ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు.నా బుద్ధి గడ్డితిని ఆ పని చేశాను.ఆ పెద్దమ్మతల్లి మాదిరిగానే చిరంజీవి తల్లి అంజనమ్మ కూడా నన్ను మన్నించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను”అంటూ శ్రీరెడ్డి ముగించింది.మరి శ్రీరెడ్డి క్షమాపణలపై మెగా కాంపౌండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Share

Related posts

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ నేతలకు చావోరేవో..??

sekhar

Breaking: బ్యాంకు ఖాతాదారులు కంగారు పడకండి.. కేవైసీ పొడిగించారు, ఎప్పటివరకంటే?

amrutha

AllariNaresh – Nani:  రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చుకోమంటున్న నాని.. ఏ పేరు సెలెక్ట్ చేసాడో చూడండి..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar