NTR: యంగ్ హీరో శ్రీ విష్ణు… ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్..!!

Share

NTR: ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలలో ప్రధమంగా వినపడే పేరు నందమూరి ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా చెలామణి అవుతున్నది బాలయ్య బాబు(Balakrishna), ఎన్టీఆర్(NTR). ఇద్దరికీ కూడా మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి.. అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ రీతిగా మీ ఇద్దరి హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్న కుర్ర హీరోలలో.. కూడా చాలామంది బాలయ్య బాబు లేదా ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం ఉన్న హీరోలు ఉన్నారు.What is NTR's connection to Arjuna Phalguna?

ఇప్పుడు ఇదే రీతిలో తాజాగా మరో కుర్ర హీరో బాలయ్య బాబు.. ఎన్టీఆర్ అంటే తనకి  ఇష్టమని బహిరంగ వేదికగా చెప్పుకొచ్చారు. ఆ కుర్ర హీరో మరెవరో కాదు శ్రీ విష్ణు(Sri Vishnu). తాజాగా శ్రీ విష్ణు నటించిన “అర్జున ఫల్గణ”(Arjuna Falguna) సినిమా ప్రమోషన్ కార్యక్రమం.. మల్లారెడ్డి విద్యాసంస్థలలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “అర్జున ఫల్గుణ” సినిమా 100% ఎంటర్టైన్మెంట్ సినిమా. కాకపోతే సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా.. తాను నటించడం జరిగిందని సినిమాల ట్విస్టులు బావుంటాయని చెప్పుకొచ్చాడు.

Movie Pazes - Encyclopedia of Entertainment Industry

ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని… స్టూడెంట్ గా అదే రీతిలో ఎన్టీఆర్ అభిమాని గా తన క్యారెక్టర్ ఉన్నట్లు శ్రీ విష్ణు తెలిపారు. ఇదే సమయంలో స్టూడెంట్ లలో ఒకరు.. ఎన్టీఆర్ అభిమాని గా నటిస్తున్నారు కాబట్టి మీకు ఎన్టీఆర్ లో క్వాలిటీ ఏంటి..? అని ప్రశ్నించగా.. దానికి శ్రీ విష్ణు సమాధానమిస్తూ ఎన్టీఆర్ పేరు చెపితే ఫ్యాన్స్ నుండి వినబడే కేకలు.. అరుపులు.. ఆ వైబ్రేషన్స్ అంటే తనకు ఎంతగానో ఇష్టమని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. దీంతో సభ ప్రాంగణం ఎన్టీఆర్ పేరుతో దద్దరిలిపోయింది.


Share

Related posts

Premi Viswanath: సిగరెట్ కాలుస్తూ గాల్లో పొగ వదులుతున్న వంటలక్క వీడియో వైరల్..!!

bharani jella

దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం:1500 గుడిసెలు దగ్ధం

somaraju sharma

అఖిల్ ని కాపాడింది కానీ…

Siva Prasad