హనుమంతవాహనంలో శ్రీమలయప్ప స్వామి !

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరవ రోజు సెప్టెంబర్ 24న ఉదయం స్వామిని హనుమంత వాహనంలో సేవించారు. ఆ విశేషాలు..

హనుమంత వాహనం : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై స్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు.
ఇక అదేవిధంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించాల్సి ఉండగా ఈసారి సర్వభూపాల వాహనంలో సేవలు చేశారు.