తెలుగు ప్రేక్షకులకు స్టాండప్ కామెడీని పరిచయం చేసిన ఘనత మెగా బ్రదర్ నాగబాబుకే దక్కుతుంది. అసలు.. కామెడీ గురించే ఎక్కువగా తెలియని తెలుగు ప్రేక్షకులకు కామెడీ షోలను పరిచయం చేసింది కూడా ఆయనే. జబర్దస్త్ షోతో మనముందుకు వచ్చి.. తెలుగు ప్రేక్షకులు ఓ గంట సేపు కూర్చొని చూసి హాయిగా నవ్వుకునేలా చేశారు. ప్రస్తుతం ఆయన జబర్దస్త్ లో లేకున్నా.. జబర్దస్త్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

జబ్దరస్త్, బొమ్మ అదిరింది లాంటి షోల కాన్సెప్టే కామెడీని పంచడం. అయితే.. కామెడీ స్కిట్ల వరకు ఓకే కానీ.. తెలుగులో స్టాండప్ కామెడీ సక్సెస్ కావడం లేదు. అందుకే.. నాగబాబు స్టాండప్ కామెడీకి శ్రీకారం చుట్టారు.
తన యూట్యూబ్ చానెల్ లో స్టాండప్ కామెడీని స్టార్ట్ చేశారు. ఖుషీ ఖుషీగా అంటూ స్టాండప్ కామెడీని నాగబాబు ప్రారంభించారు. ఇప్పటికే మొదటి సీజన్ 5 ఎపిసోడ్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.
ఆరో ఎపిసోడ్ ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ షోకు మొదట్లో నాగబాబుతో పాటు కమెడియన్ వేణు జడ్జిగా వ్యవహరించేవాడు. ఇప్పుడు నాగబాబుతో పాటు యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి యూట్యూబ్ లో స్టాండప్ కామెడీతో నాగబాబు సక్సెస్ అయినట్టే. ప్రస్తుతానికి ఎపిసోడ్ 6 ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.