యాంకర్ శ్రీముఖి పేరు.. శ్రీముఖి కాదట.. శ్రైముఖి అట. తను యాంకర్ సుమ ఇంటికి వెళ్లి చేసిన రచ్చ మామూలుగా లేదు. యాంకర్ శ్రైముఖి… సుమక్క ఇంటికి వెళ్లి చైకెన్ పలావ్ వండిందట. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే… యాంకర్ సుమకు యూట్యూబ్ చానెల్ ఉన్న సంగతి తెలిసిందే కదా.

ఆ చానెల్ కు ప్రతి వారం ఓ సెలబ్రిటీని పిలిచి.. ఆ సెలబ్రిటీతోనే వండించి.. ఇద్దరూ కలిసి లాగించేస్తారు ఆ వంటను. దానికే ఈట్ టాక్ విత్ సుమక్క అనే పేరు పెట్టి సుమ. గత వారం సుడిగాలి సుధీర్ ను తీసుకొచ్చి సుమ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుమక్క.. యాంకర్ శ్రీముఖిని తీసుకొచ్చి రచ్చ రంబోలా చేసింది.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా సుమక్క విడుదల చేసింది. ఆ ప్రోమోలో… సుమక్క.. ప్లీజ్ నాకు ఇప్పుడే పెళ్లి చేసేయ్.. రైట్ నవ్.. నాకు పెళ్లి కావాలి అంటూ శ్రీముఖి అడిగేసరికి.. ఎవరైనా ఉన్నారా అని అటూ ఇటూ చూస్తుంది సుమక్క.
దీంతో వీళ్లు కాదు.. అన్నట్టుగా చూస్తుంది శ్రీముఖి. అలాగే చికెన్ పలావ్ చేసి.. సుమక్కను ఇంప్రెస్ చేసేసింది. వాళ్ల హడావుడి మాత్రం మామూలుగా లేదు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..