ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో కమెడియన్ ముక్కు అవినాష్ అంటే అందరికి తెలుసు. తన టైమింగ్ తో అందరిని ఎంతగానో నవ్విస్తాడు. యాంకర్ శ్రీముఖి మరియు అవినాష్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ వచ్చే టైం కి శ్రీముఖి అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ సంగతి అందరికి తెలిసింది.
అలాగే అవినాష్ కి అసలు బిగ్ బాస్ షో లో చాన్స్ దొరకడం వెనుక శ్రీముఖి ఎంతో చేసిందని అప్పటిలో టాక్ వినిపించింది. ఇటీవల అవినాష్ జబర్దస్త్ లో అవకాశం కోల్పోవడంతో తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పడకుండా శ్రీముఖి జాగ్రత్త తీసుకుంది.
ప్రముఖ టీవీ చానెల్ ఇద్దరూ కలిసి ఓ షో చేసేలా శ్రీముఖి చూస్తుంది. కానీ అవినాష్ మాత్రం బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీతో మంచి రిలేషన్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాడు.
అయితే అటు అరియానా కూడా అవినాష్ ను పూర్తిగా వాడుకుని పాపులర్ అవ్వాలని చూస్తుందని ఇన్ సైడ్ టాక్. బిగ్ బాస్ హౌస్ లో వీరి రేలషన్ చూసి కొంతమంది నిర్వాహకులు వీరిద్దరూ కలిసి ఓ షో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుండగా వీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది తెలిసిన శ్రీముఖి షాక్ అయ్యిందట.
ఒకపక్క అవినాష్ కెరీర్ కోసం తాను ఇంత తాపత్రయం పడుతుంటే అవినాష్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వేరే షో కోసం ప్లాన్ చేసుకోవడం చూసి సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అవినాష్ శ్రీముఖితో కలిసి చేయవలసిన షో పట్ల అవినాష్ అస్సలు ఇంటరెస్ట్ చూపించట్లేదని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై త్వరలోనే అవినాష్ మరియు శ్రీముఖి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతుంది.