Srimukhi : ఎక్కడుంటే అక్కడ గోల గోలే. మామూలుగా ఉండదు. తన అరుపులకు పక్కన ఉన్న వాళ్లకు పిచ్చి ఎక్కడం ఖాయం. తను మాట్లాడితే మైక్ కూడా అవసరం లేదు. ఒక్కసారి మాట్లాడటం ప్రారంభిస్తే ఆపదు. కంటిన్యూగా వాగుతూనే ఉంటుంది శ్రీముఖి. Srimukhi
శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్. చాలా షోలకు యాంకర్ గా చేస్తోంది. అయినప్పటికీ.. తన అభిమానులతో మరింత టచ్ లో ఉండేందుకు.. శ్రీముఖి యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది. శ్రీముఖి పేరుతో యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి.. తన చానెల్ లో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, టూర్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తుంటుంది.
అయితే.. తాజాగా లాక్ డౌన్ తర్వాత మొదటి సారి శ్రీముఖి గోవాకు వెళ్లింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లింది. శ్రీముఖి మమ్మీ కూడా ఈ టూర్ కు వెళ్లింది. అయితే.. ఈ టూర్ లో స్పెషల్ గెస్టులు అంటే.. అరియానా, విష్ణుప్రియ. ఈ ముగ్గురు కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. గోవాకు వెళ్లి రచ్చ రచ్చ చేశారు.
Cola Goa beach లో సూపర్ ఎంజాయ్ చేసిన srimukhi
శ్రీముఖికి గోవా అంటే చాలా ఇష్టమట. అది కూడా ఫ్రెండ్స్ తో వెళితే.. వచ్చే కిక్కే వేరప్పా అంటోంది. గోవాలో కోలా గోవా బీచ్ రిసార్ట్ లో స్టే చేసి వీళ్లు చేసిన ఎంజాయ్ మామూలుగా లేదు. కోలా గోవా బీచ్ రిసార్ట్ కూడా అదిరిపోయింది. మొత్తం మీద శ్రీముఖి టూర్స్ కు వెళితే ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా మీరు చూడాల్సిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!