Srimukhi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన మాటలతో, తన అల్లరితో ఎంతగానో ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ యాంకర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి గత కొద్దీ కాలంగా వ్యాపారంలో అడుగుపెట్టాలని చూస్తోందని సినీ వర్గాలలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తుల కోసం ఎదురుచూస్తూ ఉంది. త్వరలోనే తన కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది. అవును… శ్రీముఖి కి వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు దొరికడంతో ఆమె అతి త్వరలో వ్యాపార రంగంలోకి ఆడుగుపెట్టనున్నట్లు సమాచారం.
శ్రీముఖి ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14 వ తేదీన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నదట. మన రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం తను ఈ వ్యాపార రంగానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. వారికి ఏదొక విధంగా చేయూతనివ్వడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. వ్యాపారంలోకి అడుగు పెడుతూనే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని దాని ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా అభివృద్ధి చెందాలని చూస్తుందట.
తన వ్యాపారం అందరికి ఉపయోగపడే విధంగా ఉండబోతుందట. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో విదేశీ బ్రాండ్లను సాధారణ ప్రజలకు లభించే విధంగా చెయ్యబోతుందట. అంతేకాకుండా సరికొత్త విదేశీ బ్రాండ్లను తన వ్యాపారం తో ప్రజలకు పరిచయం చేయనున్నది. అరుదుగా దొరికే కొన్ని విదేశీ బ్రాండులను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పట్టణాలలో అందుబాటులోకి తీసుకురానున్నదట శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి వ్యాపార రంగంలోకి అడుగు పెడుతుంది అన్న వార్త సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.