SS Rajamouli : నితిన్ నటించిన చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ తో పాటు హీరోయిన్ మరియు సినిమా యూనిట్ అదేరీతిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటు ముఖ్య అతిథిగా ఎస్.ఎస్.రాజమౌళి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకే రకం సినిమాలు చేసే టైపు హీరో నితిన్ అని పేరు ఉండేది దానికి భిన్నంగా చెక్ సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో నితిన్ సినిమా చేయడం గ్రేట్ అంటూ రాజమౌళి పొగిడారు.

ఎలాంటి రకమైన సినిమాలు చేయగలడు అని ఈ సినిమాతో నిరూపించుకోవడానికి నితిన్ పడ్డ కష్టం ఫలించాలని సినిమా సక్సెస్ సాధించాలని రాజమౌళి కోరుకున్నారు. అంతమాత్రమే కాకుండా సినిమా డైరెక్టర్ చందూకి ఇది ఫస్ట్ ప్రి రిలీజ్ ఈవెంట్ అనుకుంటా..తెగ టెన్షన్ పడుతున్నారు, కానీ ఈ సినిమా అవుట్ పుట్ పై చందు కి మంచి కాన్ఫిడెంట్ వుంది అంటూ రాజమౌళి తెలిపారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి…కానీ సినిమాకి సంబంధించి థీమ్..ఒక చెస్ ప్లేయర్ ని జైల్లో పెట్టి సినిమా తీయడం చాలా డిఫరెంట్ గా సినిమాపై చూడడానికి ఇంట్రెస్ట్ పుట్టించే రీతిలో టీచర్ వుందని.. లాక్ డౌన్ టైమ్ లోనే డిసైడ్ రావటం జరిగిందని “చెక్” సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.