న్యూస్

SSY Scheme: కుతురి పెళ్లికి రూ.71 లక్షలు పొందవచ్చు.. ఎలా అంటే..?

Share

SSY Scheme: కేంద్ర ప్రభుత్వం వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. అందులో ప్రధానంగా పెళ్లీడుకు వచ్చేసరికి కూతురు పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు కేంద్రం సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పేరుతో ఓ అద్భుతమైన స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కుమార్తె పెళ్లికి రూ.71లక్షల వరకూ పొందవచ్చు. ఈ స్కీమ్ లో నెలకు రూ.250 నుండి గరిష్టంగా రూ.12,500 వరకూ పొదుపు చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చిన తరువాత సగం ఉపసంహరించుకోవచ్చు. అలాగే కుమార్తె పెళ్లి సమయానికి మొత్తం తీసుకోవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు ఈ పథకం మెచ్యురిటీకి వస్తుంది. పెళ్లితో పాటు చదువుకు కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. డిఫాల్ట్ లేకుండా మెచ్యురిటీ వరకూ కొనసాగిస్తే రూ.71 లక్షల వరకూ చేతికి వస్తాయి. ఈ డిపాజిట్ పైన ఆదాయపన్ను మినహాయింపు ఉంది.

SSY Scheme: ఆడ పిల్లల భవిష్యత్తు కోసం

ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించారు. పదేళ్లలోపు ఆడ పిల్లల పేరు మీద తల్లిదండ్రులు దీనిని ప్రారంభించవచ్చు. పదిహేనేళ్ల పాటు కంట్రిబ్యూట్ చేయాలి. సెక్షన్ 80 సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. తల్లిదండ్రులు గరిష్టంగా రెండు ఖాతాలు అంటే ఇద్దరు కూతుర్లపై ఈ ఖాతాను తెరువవచ్చు. ఈ పథకానికి ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతం గా ఉంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాలు లేదా ఆడ పిల్ల 18 సంవత్సరాలు నిండి వివాహం అయ్యే వరకూ మెచ్యురిటీ పిరియడ్ ఉంటుంది. ఉన్నత విద్య కోసం 18 సంవత్సరాలు నిండిన తర్వార బ్యాలెన్స్ నుండి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఖాతా తెరిచిన తరువాత పదిహేనేళ్లు క్రమంగా జమ చేయాలి.

 

12,500లు చొప్పున 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే రూ.71లక్షల ఆదాయం

సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షతా భావం పొగొట్టే లక్ష్యంతో 2015లో కేంద్రం బేటీ బచావో, బేటీ పడావో పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ది యోజనను తీసుకువచ్చింది. ఈ పథకంలో ఎలాంటి డిఫాల్ట్ లేకుండా నెలకు 12,500లు చొప్పున 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మెచ్యురిటీ (బాలిక వివాహ) సమయానికి రూ.71లక్షల ఆదాయం వస్తుంది. ఏడాదికి 60వేల చొప్పున 15 సంవత్సరాలు కడితే మెచ్యురిటీ సమయానికి రూ.28 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది.


Share

Related posts

Swathishta Saree Photos

Gallery Desk

జగన్, కెసిఆర్ లకు మోడీ ఫోన్..! సీన్ రివర్స్ అయ్యిందే…

arun kanna

రాజ్యసభలో గందరగోళం,వాయిదా

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar