NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Jagan Stalin: చట్టాలు రాజ్యాంగ బద్దంగానే చేయాలి..! జగన్ కు అయిన అనుభవమే స్టాలెన్ కూ..!?

Jagan Stalin: చట్ట సభల్లో తమకు అధికారం ఉంది. ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారు. మేము ఏ చట్టం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది పాలకుల పక్షాల వాదనగా ఉంటుంది. అయితే చేసిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి లేకపోతే కోర్టులు తప్పుబడతాయి. వాటిని రద్దు చేస్తాయి. ఏపిలో రీసెంట్ గా మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో అసెంబ్లీ ఆ అంశంపై పెద్ద చర్చే జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ప్రభుత్వ నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోయాయి. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా కోర్టుల్లో అనేక తీర్పులు వచ్చాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులే మీడియాల్లో హైలెట్ అవుతుండటంతో ఈ ప్రభుత్వం ఏది చేసినా కోర్టులు తప్పుబడుతున్నాయి అని అధికార పార్టీ వర్గాలు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఒక్క ఏపిలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా అక్కడి పాలకపక్షాలు రాజ్యాంగానికి విరుద్దంగా చట్టాలు చేస్తే అక్కడి కోర్టులు తప్పుబడతాయి, వ్యతిరేక తీర్పులు ఇస్తుంటారు. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్లినా అక్కడి హైకోర్టు తీర్పులనే సమర్ధిస్తున్న సందర్భాలు ఉంటాయి. తాజాగా ఏపిలో సీఎం జగన్మోహనరెడ్డికి అయిన అనుభవమే మన సరిహద్దు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎదురైంది.

Stalin's experience is similar to that of Jagan
Stalins experience is similar to that of Jagan

Jagan Stalin: స్టాలిన్ సర్కారు చేసిన చట్టానికి చుక్కెదురు

తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వన్నియార్ కమ్యునిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇందు కోసం స్టాలిన్ సర్కార్ 2021లో ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ లు దాఖలు కాగా హైకోర్టు విచారణ జరిపి ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉందంటూ తమిళనాడు యాక్ట్ 2021 కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా..జస్టిస్ లావు నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్ధించింది. ఎంబీసీలలో వన్నియార్ లను ప్రత్యేక సమూహంగా పరగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,16 లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్ పేర్కొంది.

 

ఏపి ప్రభుత్వానికి సంబందించి హైకోర్టులో గానీ, సుప్రీం కోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చిన సమయంలో అంతగా ప్రాధాన్యత ఇవ్వని సాక్షి మీడియా తమిళనాడుకు సంబందించి ఈ తీర్పుపై “సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆ రిజర్వేషన్ చెల్లదంటూ తీర్పు !”అని హైలెట్ చేస్తూ వార్త ఇవ్వడం గమనార్హం.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju