నిలిచిపోయిన బ్యాంక్ సేవలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 85 వేల మంది బ్యాంకు ఉద్యోగులు విధులకు దూరమయ్యారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు యథావిథిగా కొనసాగుతున్నాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), ఎన్‌సీబీఈ, ఎన్‌ఓబీడబ్ల్యూ సహా తొమ్మిది యూనియన్‌ల సంయుక్త సంఘమైన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.

SHARE