కోట్లలో ఆస్తులు.. హీరో నుంచి కమెడియన్ అయ్యాడు!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది రంగప్రవేశం చేస్తుంటారు. అలా ప్రవేశించిన వారికి ఒక వారధిగా నిలబడి ఎన్నో సువర్ణవకాశాలను అందిస్తుంటుంది. అండగా నిలుస్తూ సమాజంలో మంచి గుర్తింపును అందించడంలో వెండెతెరకు మించిన మరో సాధనం లేదనే చెప్పుకోవచ్చు. సామాన్యులుగా ఉన్న వారిని సైతం ఒకే ఒక్క పాత్రతోనే స్టార్స్ ను చేసేస్తుంది. అలా రాత్రికి రాత్రే స్టార్ అయిన వారెందరో ఉన్నరనే చెప్పుకోవచ్చు. అందుకు కావాల్సిందే కేవలం పట్టుదల, అందుకోసం చేసే ప్రయత్నం, ఇష్టం ఉంటే చాలు స్టార్ అవ్వొచ్చు అని నిరూపించినవారెందరో.. అలా తనకంటూ ఒక ప్రత్యేక గురింపు తెచ్చున్న వ్యక్తే సుధాకర్. నటుడిగా, నిర్మాతగా, హాస్యనటుడిగా, ఇతర నటుడిగా సుధారకర్ ఒక వెలుగు వెలిగారు.

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సుధాకర్. తెలుగు ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న మెగస్టార్ చిరంజీవితో ఇతర ప్రముఖులతో కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సుధాకర్ హీరోగా జనాలకు పరిచయమయ్యారు. కాగా చిరంజీవికంటే తమిళంలో స్టార్ హీరోగా ఎదిగారు ఈయన. కాగా ఆతర్వాత కమెడియన్ గా అందరినీ నవ్విస్తూ తనదైన ముద్రను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలకోసం ఎదురుచూస్తున్న సమయంలో సుప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా సుధాకర్ కు ఛాన్స్ ఇచ్చాడు. కిళుక్కెమ్ పొంగెమ్ రెయిల్ అనే సినిమా ద్వారా సుధాకర్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఘనవిజయం సాధించడంతో ఈయనకు సినిమాలు క్యూ కట్టాయి.

దాదాపుగా ఈయన 45 సినిమాల్లో హీరోగా నటించి తన ప్రతిభను చాటకున్నారు. అందులోనూ ఈయన స్టార్ హీరోయిన్ అయిన రాధికతో సుధాకర్ ఏకంగా 18 సినిమాల్లో నటించడం విశేషం. ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని మార్పుల మూలంగా ఈయన కోలీవుడ్ ను వీడాల్సి వచ్చింది. దాన్ని వీడి తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా, కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా యముడికి మొగుడు, శుభాకాంక్షలు, స్నేహితులు, సుస్వాగతం, హిట్లర్ వంటి సినిమాల్లో నటించి సుధాకర్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈయన నటనకు ప్రభుత్వం హాస్యనటుడిగా నంది అవార్డును కూడా అందించింది. అయితే ఎన్నో సినిమాల్లో నటించి ఈయన భారీగానే వెనకేశారు. దాంతో చిరంజీవితో యముడికి మొగుడు సినిమాను తన మిత్రుడు హరిప్రసాద్ తో కలిసి నిర్మించారు. దీనికి మంచి పేరు రావడంతో మరిన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈయన 2010, జూన్ 29 న అనారోగ్యంతో ఆస్పటల్ ను చేరాడు. అక్కడే ఆయన కోమాలోకి వెళ్లడం జరిగింది. అయితే ఈయన 2015 లో కోమాలోనుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కొన్ని సినిమాలు కూడా నిర్మించనున్నట్టు ఆయన పేర్కొన్నాడు.