B.Gopal: స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ప్రభాస్ తో తీసిన ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడానికి కారణాలు చాలానే..!

Share

B.Gopal: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా బి.గోపాల్‌కి ఉన్న పేరు ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే. లారీ డ్రైవర్..సమర సింహా రెడ్డి, ఇంద్ర, నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ అందుకున్న భారీ యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ సినిమాలు అందరికీ గుర్తొస్తాయి. గతంలో బి.గోపాల్ వెంకటేశ్‌తో బొబ్బిలి రాజా, మెగాస్టార్‌తో స్టేట్ రౌడీ, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ తీసి స్టార్ హీరోల సినిమాలంటే కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్ మాత్రమే అనే పేరు సంపాదించుకున్నారు.

star director b.gopal prabhas movie is flop due to this reason
star director b.gopal prabhas movie is flop due to this reason

అందరూ సీనియర్ హీరోలతో బి.గోపాల్ దర్శకుడిగా సినిమాలు నిర్మించేందుకు పెద్ద నిర్మాణ సంస్థలు భారీగా అడ్వాన్స్ ఇచ్చేవారు. ఆయన కూడా వారి నమ్మకం ఏమాత్రం వమ్ము కాకుండా భారీ హిట్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకొని సినిమా తీసేవారు. అలా ఇండస్ట్రీ వర్గాలలో, ప్రేక్షకుల్లో బి.గోపాల్‌ దర్శకత్వంలో హీరో ఎవరైనా సినిమా భారీ మాస్ హిట్ అని నమ్మకంగా ఫిక్సైపోయి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న బి.గోపాల్ మోహన్ బాబుకి కలెక్టర్ గారు, బ్రహ్మ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.

B.Gopal: ఇంద్ర కూడా ఇదే తరహాలో వచ్చిన సినిమా.

ఆ తర్వాత ఆయన కెరీర్‌లో మాత్రమే కాకుండా బాలయ్య, అలాగే నిర్మాతలకి మైల్ స్టోన్ మూవీ అంటే సమర సింహా రెడ్డి. ఈ సినిమాతో బాలకృష్ణ రేంజ్ ఊహించని విధంగా మారిపోయింది. చెప్పాలంటే ఇండస్ట్రీలో సమర సింహారెడ్డి ఓ సంచలనం. ఆ తర్వాత అదే తరహాలో ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చాయి. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ అదే జోనర్‌లో సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర కూడా ఇదే తరహాలో వచ్చిన సినిమా. దీనికి దర్శకుడు బి.గోపాల్. ఇంద్ర సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.

నిర్మాత అశ్వనీ దత్‌కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్యకి నరసింహ నాయుడుతో మరో భారీ హిట్ ఇచ్చాడు. జూనియర్ ఎన్.టి.ఆర్‌కి అల్లరి రాముడు అనే సినిమాతో మరో భారీ హిట్ ఇచ్చారు. ఇలా మంచి ఊపు మీద ఉన్న బి.గోపాల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆనం గోపాల కృష్ణ నిర్మాణంలో మొదలైంది.

B.Gopal: ప్రభాస్ లాంటి హీరోకి సరిపోయే కథ ఏమాత్రం కాదు.

అయితే సినిమా మొదలయ్యాక నిర్మాతతో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ రావడంతో ఆయన తప్పుకొని ప్రముఖ నిర్మాత అడ్డాల చంటి వచ్చి చేరారు. కథ చాలా వీక్. ప్రభాస్ లాంటి హీరోకి సరిపోయే కథ ఏమాత్రం కాదు. ఒక అగ్ర దర్శకుడు అయి ఉండి ప్రభాస్‌తో ఇలాంటి కథతో సినిమా తీస్తే ఆడదనే కారణంతోనే ముందు నిర్మాత తప్పుకున్నారు. ఆ తర్వాత అయినా కథలో మార్పులు చేయకుండా అలానే తీశారు. అడవి రాముడు అంటూ పేరు..ఆర్తి అగర్వాల్ హీరోయిన్. మణిశర్మ సంగీతం..సీనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలోని పాట రీమిక్స్.

ఇవేవి ప్రభాస్‌కి హిట్ ఇవ్వలేకపోయాయి. అంతేకాదు నిర్మాత అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది ఈ సినిమా. బి.గోపాల్ మీద అప్పటి వరకు ఉన్న అంచనాలు అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు ప్రేక్షకుల్లో ఒక్కసారిగా మారిపోయాయి. ఏ సినిమాకైనా కథ ముఖ్యం. అన్ని సూపర్ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ ప్రభాస్ హీరో అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా సినిమా చేయాలి. కానీ అడవి రాముడు సినిమాలో అది కనిపించలేదు. అందుకే ప్రభాస్ రేంజ్ పెరుగుతుందనుకుంటే ఈ సినిమా విషయంలో అది తారుమారయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సేఫ్ అయినా కూడా ఎక్కువగా విమర్శలందుకుంది మాత్రం దర్శకుడు బి.గోపాల్ ఒక్కరే.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అనవసరంగా సుజాత తో పెట్టుకుంది హారిక ఎలిమినేషన్ గ్యారెంటీ

arun kanna

అరెస్టుకు నెల రోజులు గడువు కోరిన సజ్జన్ కుమార్

Siva Prasad

హిందీ రీమేక్‌లో సునీల్‌

Siva Prasad