Allu arjun : పుష్ప సినిమా రిలీజ్ కాకుండానే ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఈ పుష్ప. ఇందులో రష్మిక మందన్న గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. రెండు భాగాలుగా పుష్ప రిలీజ్ చేసే సన్నాహాలలో మేకర్స్ ఉన్నారు. మొదటిసారి అయిదు భాషల్లో పుష్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా నిర్మాణ సంస్థలలో 200 కోట్ల పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి చేశాక ఐకాన్ సినిమా చేస్తాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అంటే వకీల్ సాబ్ తో మంచి హిట్ అందుకున్న వేణు శ్రీరాం వెయిటింగ్ లో ఉన్నట్టు. ఇతను మాత్రమే కాదు..ఇప్పుడు అల్లు అర్జున్ కోసం తెలుగు టాప్ డైరెక్టర్స్ తో పాటు తమిళ టాప్ డైరెక్టర్స్ కూడా కథలను సిద్దం చేసుకొని క్యూ కడుతున్నారని చెప్పుకుంటున్నారు. పుష్ప పూర్తి చేసి అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. ఇటు కొరటాల, అటు వేణు శ్రీరాం అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో చేస్తాడా లేదా ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసేందుకు లిస్ట్మాత్రం పెరిగిపోతోంది.
Allu arjun : అల్లు అర్జున్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో ..?
బాలకృష్ణ తో ఇప్పుడు అఖండ తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శ్రీను. తర్వాత ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ప్రచారం సాగుతుండగా గీతా ఆర్ట్స్ వారి నిర్మాణంలో విక్రం కుమార్ కూడా ఒక సినిమా అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఆయన మనం సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులారిటి పొందారు. ఇటు తెలుగులో అటు తమిళంలో సినిమాలు చేస్తున్నారు. కానీ ఆయన ఆశించిన సక్సెస్‌లు అందుకోవడం లేదు. నాగ చైతన్య హీరోగా థాంక్యూ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఓకే అంటే ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఇలా అల్లు అర్జున్ కోసం దర్శకులందరూ బాగానే వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తాడో బన్నీ చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!