న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని తీవ్ర నిరాశకి గురవుతున్న స్టార్ హీరోయిన్?

Share

పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. ఆయనతో నటిస్తే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని కలలు కంటుంటారు. కానీ ఇప్పుడు నిధి అగర్వాల్ మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అంటూ తెగ బాధపడిపోతోంది. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

సూపర్ స్టార్‌డమ్‌ ఈమె సొంతం

నిధి అగర్వాల్ సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించింది కానీ అవి రెండూ ఫ్లాప్ కావడంతో ఆమె టాలీవుడ్‌లో వెంటనే క్లిక్ కాలేకపోయింది. ప్రేక్షకుల్లో మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఈ ముద్దుగుమ్మ మంచి ఎత్తు, అందంతో చాలామంది హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా ఉంది. అందుకే స్టార్ హీరోలు ఆమెకు ఛాన్స్‌లు ఇస్తున్నారు. అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ మూవీలో నిధి అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. తరువాత శింబుతో ఒక సినిమా, జయం రవితో ఒక సినిమా చేసి హిట్స్ అందుకుంది.ఇలా కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు క్రేజ్ సంపాదించుకుంది. దాంతో ఈ భామని పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వరించింది.

అయినా తీవ్ర అసంతృప్తి

క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో మెయిన్ హీరోయిన్ నిధి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఉండటంతో నిధి అగర్వాల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా త్వరగా రిలీజయితే పాన్ ఇండియా లెవెల్ స్టార్ అవ్వచ్చని ఆశపడింది. మంచి క్రేజ్ వస్తే టాలీవుడ్ ని ఏలోచ్చు అనుకుంది. కానీ ఇంతవరకు సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవ్వలేదు. దీంతో ఈ సినిమా అసలు ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుందో లేదో తెలియక ఆమె చాలా నిరాశ వ్యక్తపరుస్తూ ఉన్నట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీలో టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.


Share

Related posts

ఆ హీరో త‌న పేరును ఎలా కావాలంటే అలా వాడుకోమ‌న్నాడు: సాయి ప‌ల్ల‌వి

kavya N

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోండి : నాగ్‌

Siva Prasad

Dharsha Gupta Cute Images

Gallery Desk