Heroines: అవకాశాలు వచ్చే వరకు టాలీవుడ్..క్రేజ్ వచ్చాక బాలీవుడ్..స్టార్ హీరోయిన్స్ తీరేంటి ఇంత దారుణం

Share

Heroines: మోడలింగ్ రంగం నుంచి సినిమాలలో అవకాశాలు అందుకోవాలని చాలామంది ఎంతగా అటు ముంబై, ఇటు హైదరాబాద్‌లో ప్రయత్నాలు చేస్తారో ఇప్పటికే చాలామంది విషయంలో అర్థమైంది. చెప్పాలంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న వారందరూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మోడలింగ్ రంగం నుంచే. అలా వచ్చిన వారిలో అందరూ హీరోయిన్‌గా సెటిలవడం లేదు. వచ్చిన వారు వచ్చినట్టు కొన్ని సినిమాలు చేసి ఫేడౌట్ అవుతున్నారు. అతికొద్ది మంది మాత్రమే స్టార్స్‌గా వెలుగుతున్నారు.

star heroines are crazy about bollywood
star heroines are crazy about bollywood

అయితే ఇలా వచ్చిన హీరోయిన్స్ అందరి టార్గెట్ బాలీవుడ్ మార్కెట్ మీదే. అక్కడ స్టార్ హీరోయిన్స్‌గా క్రేజ్ తెచ్చుకునేందుకు టాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగోలా తెలుగులో టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇక్కడ కొన్ని సినిమాలు చేసి అవి హిట్ అవగానే నెమ్మదిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు అక్కడ స్టార్ స్టేటస్ దక్కించుకోవడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేసి హిందీ సినిమాలలో ఛాన్సెస్ అందుకొని నెమ్మదిగా టాలీవుడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. దాదాపు అందరు హీరోయిన్స్ మైండ్ సెట్ గానీ స్ట్రాటజీ గానీ ఇదే అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్.

Heroines: పూజా ఇక టాలీవుడ్‌కి టాటా అన్నట్టుగా ప్రవర్తించింది.

అందుకు ఉదాహరణ పూజా హెగ్డే, రష్మిక మందన్నలనే తీసుకోవచ్చు. పూజా హెగ్డే ముంబై నుంచి వచ్చి తెలుగులో ఒకేసారి రెండు సినిమాలతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలే ముకుంద, ఒక లైలా కోసం. ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయితే బాలీవుడ్‌లో డెబ్యూ సినిమా మొహంజాదారో సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించింది. ఈ సినిమాలో అవకాశం అందుకున్న పూజా ఇక టాలీవుడ్‌కి టాటా అన్నట్టుగా ప్రవర్తించింది. కానీ హృతిక్‌తో చేసిన మొహంజాదారో సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో పూజా హెగ్డేకి అవకాశాలు దక్కలేదు. దాంతో మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాల కోసం చూసింది. అదృష్ఠం కలిసి వచ్చి దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్, మహర్షి, అల వైకుంఠపురములో, రాధే శ్యాం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలలో అవాకాశాలు దక్కించుకొని క్రేజీ స్టార్‌గా మారింది. ఇప్పుడు ఫుల్ ఫోకస్ బాలీవుడ్ మీద పెట్టింది. ఆ మధ్య టాలీవుడ్ ప్రేక్షకుల మీద సెన్షేషనల్ కామెంట్స్ కూడా చేసి హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో రష్మిక మందన్న కూడా కొనసాగుతోంది.

Heroines: టాలీవుడ్‌లో అవకాశాలు అందుకొని బాలీవుడ్‌కి చెక్కేస్తున్నారు హీరోయిన్స్.

ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత దేవదాస్, భీష్మ, సరిలేరి నీకెవ్వరు సినిమాలు చేసీ క్రేజి హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు 5 భాషలలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప, యంగ్ హీరో శర్వానంద్ సరసన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తుంది. అయితే ఇప్పుడు రష్మిక ఫోకస్ కూడా బాలీవుడ్ మీదే ఉంది. టాలీవుడ్ కంటే ఎక్కువ సినిమాలను బాలీవుడ్‌లోనే ఒప్పుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న రష్మిక ఇప్పటికే ఓ సినిమాను పూర్తి కూడా చేసింది. ఇలా టాలీవుడ్‌లో అవకాశాలు అందుకొని బాలీవుడ్‌కి చెక్కేస్తున్నారు హీరోయిన్స్.

 


Share

Related posts

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం: క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ అరెస్టు

Siva Prasad

బిగ్ బాస్ 4 : కుమార్ సాయి బయటకు వచ్చి ఆమెను ఎంత బ్యాడ్ చేసేశాడో చూడండి..! 

arun kanna

ఇండియాలో ఎక్కువమంది యువత మొబైల్ ఫ్రీ టైం కావాలనుకుంటున్నారట

Kumar