ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతీ ఏటా నిర్వహించే బిగ్ బాస్ రియాలిటీ షోపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెల్సిందే. తెలుగు ఇండస్ట్రీ వరకూ బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్స్ తో టాప్ లో ఉంటూ జనాల్ని ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికి మూడు సీజన్లు జరగగా నాలుగో సీజన్ ను ఈపాటికే నిర్వహించాల్సి ఉంది.
అయితే అనుకోకుండా కరోనా వైరస్ వల్ల ఈ షో వాయిదా పడింది. అయితే గత కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ సీజన్ 4 గురించి రూమర్స్ వస్తున్నాయి. దాన్ని నిజం చేస్తూ బిగ్ బాస్ 4 త్వరలో మొదలుకాబోతోందని స్టార్ మా సంస్థ తెలిపింది. ఆగష్టులో ఈ షో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తక్కువ రోజుల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేసారు.