Star Mahila : స్టార్ మహిళ..Star Mahila ఈటీవీలో ఎంతో క్రేజ్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో ప్రసారం అవుతోంది. మధ్యలో కొన్ని రోజులు దీన్ని ఆపేసినా.. మళ్లీ కంటిన్యూ చేశారు. తాజాగా స్టార్ మహిళ 100వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్టార్ మహిళ స్పెషల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు ఉప్పెన టీమ్ ను గెస్ట్ గా పిలిచారు.

Star Mahila : ఉప్పెన టీమ్ తో యాంకర్ సుమ ఆటాపాటా
ఈ స్పెషల్ ఎపిసోడ్ కు ఉప్పెన టీమ్ గెస్టులుగా వచ్చారు. ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు.. వచ్చి సందడి చేశారు. ఈసందర్భంగా వీళ్లు యాంకర్ సుమతో సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. అలాగే సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ ను యాంకర్ సుమ వీళ్లతో చెప్పించింది.
సినిమా మొత్తం మీద హైలెట్ అయిన డైలాగ్.. వీడు ముసలోడు అవ్వకూడదే. వీడిని ముసలోడిని కానివ్వను.. అంటూ హీరోయిన్ కృతి శెట్టి చెప్పే డైలాగ్ సినిమాకే ప్లస్ పాయింట్. ఆ డైలాగ్ నే మళ్లీ కృతి శెట్టి.. అంతే స్వీట్ నెస్ తో స్టేజ్ మీద చెప్పింది.
మొత్తం మీద ఉప్పెన టీమ్ తో స్టార్ మహిళ స్పెషల్ ప్రోగ్రామ్ లో యాంకర్ సుమ బాగానే సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీరు కూడా చూసేయండి.