NewsOrbit
న్యూస్

పిల్లలే పెళ్లి పెద్దలుగా రెండో వివాహం చేసుకుంటున్న స్టార్ సింగర్ సునీత!

మాధుర్యం నిండిన గొంతుతో పాటు సౌందర్యాన్ని కూడా సొంతం చేసుకున్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలు నిజమని తేలిపోయింది.సునీతే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తను చేసుకోబోయే వరుడి ఫోటోను కూడా సోమవారం మధ్యాహ్నం తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసేసింది.

డైవోర్సీ అయిన సునీత రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.పందొమ్మిది ఏళ్ల వయసులోనే సునీతకు వివాహం కావడం ఇద్దరు సంతానం కలగడం జరిగింది.అయితే భర్తతో భేదాభిప్రాయాలు తలెత్తగా వారు చాలా కాలం దూరంగా ఉన్నారు .వివాదం మరింత ముదరడంతో వారు విడాకులు కూడా తీసుకున్నారు.తదుపరి సునీత రెండో వివాహంపై అప్పట్లో అనేక వార్తలు రాగా ఆమె ఖండిస్తూ వచ్చింది.చివరకు తెలంగాణాకు చెందిన ఓ కాంగ్రెస్ నేతను ఆమె వివాహం చేసుకోనున్నట్లు కూడా పుకారు రేగింది.కానీ ఆమే కాకుండా ఆ రాజకీయ నేత కూడా ఆ వదంతులను ఖండించారు.

తాజాగా ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో సునీత రెండో వివాహం ప్రస్తావనకు రాగా ఆమె తప్పించుకునే ధోరణిలో బదులిచ్చింది.కానీ గత వారం రోజులుగా సునీత రెండో వివాహం విషయమై మీడియా లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపధ్యంలో సునీత తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ధ్రువీకరించింది.రామ్ అనే ఒక మంచి స్నేహితుడు తన జీవితంలో ప్రవేశించాడని, తన బాగోగులు చూసుకుంటున్నాడని,తామిద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నామని సునీత ఫేస్బుక్ సాక్షిగా వెల్లడించింది.ఒక తల్లిగా తాను తన ఇద్దరు పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు చేయాల్సినంత చేశానని ఆమె చెప్పింది.

ఇప్పుడు ఆ పిల్లలే తనను కూడా జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారని కూడా సునీత పేర్కొంది.కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఆశీర్వాదాలతో రామ్ ను తాను వివాహం చేసుకోబోతున్నట్లు సునీత తెలిపింది.ఇంతకుముందు మాదిరిగానే తన స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ తనకు అండగా నిలవాలని సునీత విజ్ఞప్తి చేసింది.కాగా ఫేస్ బుక్కులో ఆమె పెట్టిన ఈ పోస్ట్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.వందలాది మంది ఆమెను అభినందిస్తూ సమాధానాలిస్తున్నారు.తల్లి పెళ్లికి సహకరిస్తోన్న ఎదిగిన ఆమె ఇద్దరు పిల్లలను కూడా వారు ప్రశంసిస్తున్నారు.ఎవ్వరూ కూడా సునీత నిర్ణయాన్ని తప్పు పట్టకపోవడం అనేది విశేషం.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju