SpaceX Starlink: ప్రజెంట్ టెక్నాలజీ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు క్షణాల్లోనే ప్రపంచంలో జరుగుతున్న ప్రతీ సంగతిని తెలుసుకోగలుగుతున్నారంటే దానికి కారణం శాటిలైట్స్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, ఈ శాటిలైట్స్ ఎలా పని చేస్తాయో అని తెలసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్స్ ప్రవేశపెట్టారు. తద్వారా ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే శాటిలైట్స్ వర్కింగ్ గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
శాటిలైట్స్తోనే హై స్పీడ్(High Speed INTERNET) ఇంటర్నెట్..
ఇప్పటికే అంతరిక్షంలోకి పంపిన ఉప గ్రహాల ఆధారం డేటా రీడ్ అయి మనకు అందించబడుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక సందర్భాలలో ఉప గ్రహాలు వల్ల ప్రయోజనాలు తెలుపుతుంటారు. అలా ఆకాశంలోకి పంపబడే స్టార్ శాటిలైట్స్‌ను స్పేస్ ఎక్స్ కంపెనీ వారు రూపొందించారు. ఈ శాటిలైట్స్ ఆకాశంలోకి ఓ లైన్ లాగా వెళ్తుంటాయి. వీటిని కొంగా లైన్ అని పిలుస్తారు. ఈ శాటిలైట్ లైన్స్‌లో దాదాపుగా డజనుకు పైగా ప్రశాశవంతమైన, శక్తిమంతమైన శాటిలైట్స్ ఉంటాయట.
మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ..
శాటిలైట్స్ వల్లనే మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ రీచ్ బాగా పెరిగింది. ఈ స్టార్ లింక్ ప్రాజెక్టు వలన కనెక్టివిటీ ఇంకా పెంచాలనేది లక్ష్యం కాగా, ఇప్పటికే ఆ లక్ష్యం రీచ్ అయింది కూడా. కొద్ది రోజుల కిందట స్పేస్ఎక్స్ కూటమిలోని ఫాల్కన్ 9 అనే రాకెట్ ప్రమాదవశాత్తు పేలిపోయింది.
కాగా, దానిని రిప్లేసే చేసేందుకుగాను దాదాపు 60 శాటిలైట్లను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అలా శాటిలైట్లు మొత్తంగా తమ గమ్యస్థానాలకు వెళ్తే క్రమంలో ప్రకాశవంతమైన కాంతిని ప్రసరింపజేసేలా కనబడుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా యాక్టివ్ స్టార్ లింక్ శాటిలైట్స్ ఉండగా, స్పేస్ ఎక్స్ కంపెనీ శ్రమ వల్ల జూన్ 2021 వరకు ఇలా కూటమిగా ఏర్పడింది. స్టార్ లింక్ అనేది భూమిపైన అతిపెద్ద ఉపగ్రహ కూటమిగా ఉంది. స్టార్ లింక్ శాటిలైట్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం స్పేస్ ఎక్స్ కంపెనీ లక్ష్యంగా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?