టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం… బయటపడే పేర్లన్నీ స్టార్లవే?

ఇప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల కన్నా కూడా డ్రగ్స్ కేసు వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. వార్తలు ఏమిటి.. ఎన్సీపీ అధికారులు పెద్ద పెద్ద స్టార్ హీరో హీరోయిన్లకు నోటీసులు మీద నోటీసులు జారీ చేస్తున్నారు. రోజుకొక కొత్త పేరు బయటకు వస్తోంది. అభిమానులు రోల్ మోడల్ గా తీసుకునే వారే ఈ కేసులో ఇరుక్కోవడం గమనార్హం. పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు ఇప్పుడు బహిర్గతం కావడంతో టాలీవుడ్ లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది అని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఇక తాజాగా ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ తో సరిపెట్టకుండా టాలీవుడ్ పై దృష్టి సారించడంతో ఇక్కడ ముచ్చెమటలు పడుతున్నాయి అని గుసగుస హీట్ వినిపిస్తోంది. ముందు రకుల్ పేరు బయటకు వచ్చింది ఆ తర్వాత ఒక్కసారిగా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత పేరు కూడా వచ్చింది. గతంలోనే పూరి జగన్నాథ్, చార్మి వంటి ప్రముఖులు ఇలాంటి ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలను కూడా ఎన్సీబీ సహకరించిందని మీడియా కథనాలు వస్తున్నాయి.

కెల్విన్ అనే డీలర్ తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల జాబితా హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ నుండి ఎన్సీబీ సేకరించి చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుపుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చింది.ఎన్సీబీ లో విచారణ అధికారిగా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్ మీడియాకు అందించిన వివరాలు ఇలా ఉన్నాయట. ఇప్పటికే 12 కేసులో ఉన్న వారి శాంపిల్స్ సేకరించారు. వ్యాపార వేత్తల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.

అయితే ఒక్కసారిగా టాలీవుడ్ లో పెద్ద పెద్ద పేర్లు బయటకు రావడంతో చాలా స్ట్రార్లు ఇందులో ఇన్వాల్వ్ అయి అయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఒక స్టార్ హీరో పేరు బయటకు వచ్చి లేదా హీరోయిన్ ను ఎన్సీబీ ముందు విచారణకు కూర్చోబెడితే ఒక్కొక్కటిగా అందరి పేర్లు బయటకు వస్తాయని…. అదేమీ పెద్ద విషయం కాదు అని ఫిలిం నగర్లో మాట్లాడుకుంటున్నారు. సరే డ్రగ్స్ వ్యవహారం ఇంతలా పాకిపోయింది అని అంటున్నారు కదా మరి ఇది ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదో ఎవరికీ అర్థం కావడంలేదు. ఏదేమైనా అటు నటీనటులతో పాటు ఇటు వారి ఫ్యాన్స్ కూడా తెగ కలవరపడుతున్నారు.