ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లో మళ్లీ పాజిటివ్ కేసులు బయట పడుతుండటం ప్రపంచ దేశాలకు టెన్షన్ ని పుట్టిస్తున్నాయి. సరిగ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అసలు వైరస్ పెట్టడానికి గల కారణాలు తెలుసుకోవటం కోసం చైనాలో పర్యటిస్తున్న తరుణంలో అక్కడ పాజిటివ్ కేసులు పెరగటం అనుమానానికి తావిస్తోంది.
ఎక్కడైతే వైరస్ పుట్టిందో అనగా వూహాన్, ప్రావిన్స్ ప్రాంతాలలో కేసులు పెరుగుతున్నట్లు మళ్లీ అక్కడ లాక్ డౌన్ చేపట్టడం గందరగోళంగా మారింది. ఈ ప్రాంతాలలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వైరస్ కనుగొనేందుకు అడుగుపెడుతున్న తరుణంలో.. చైనా దేశం లాక్ డౌన్ చర్యలకు పాల్పడటం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
మొదటి నుండి ప్రపంచ దేశాలు కావాలని వైరస్ పుట్టించి ప్రపంచంలోకి చైనా వదిలింది అని అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ విధంగా వ్యవహరించడంతో మరింతగా చైనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్న యి. ఇదిలా ఉంటే బయటపడిన కొత్త పాజిటివ్ కేసులు ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారివల్లే వైరస్ సోకినట్లు అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్పుకోస్తున్నారు. దీంతో స్థానికంగా వైరస్ విజృంభించకుండా ఉండటానికి లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు అక్కడ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కొత్త పాజిటివ్ కేసులు బయటపడటం ప్రపంచానికి మరింత షాక్ కి గురిచేస్తోంది.