ట్రెండింగ్ న్యూస్

Start Music : స్టేజ్ మీదే బాబా భాస్కర్ పరువును గంగలో కలిపేసిన యాంకర్ సుమ?

Start Music స్టేజ్ మీదే బాబా భాస్కర్ పరువును గంగలో కలిపేసిన యాంకర్ సుమ
Share

Start Music : స్టార్ట్ మ్యూజిక్ Start Music షో తెలుసు కదా. స్టార్ మాలో ఇటీవలే స్టార్ట్ చేశారు. ఇది కూడా ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ షోనే. కొందరు సెలబ్రటీలను గెస్టులగా పిలిచి.. వాళ్లలో రెండు గ్రూపులు చేసి.. వాళ్లతో కొన్ని ఆటలు ఆడించి.. సరదాగా కాసేపు ప్రేక్షకులను నవ్వించే ప్రోగ్రామ్ ఇది. ఈ షో ఉద్దేశం కూడా కామెడీని జనరేట్ చేయడమే.

Start Music : Baba bhaskar versus anchor suma
Start Music : Baba bhaskar versus anchor suma

ఇప్పటికే స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే ఫుల్ లెన్త్ కామెడీ షో ప్రసారం అవుతోంది. స్టార్ట్ మ్యూజిక్ కూడా ఎంటర్ టైన్ మెంట్ జానర్ కే చెందిన మరో షో అన్నమాట. మొత్తానికి ఈ షో కూడా ప్రస్తుతం టీఆర్పీలో దూసుకుపోతోంది. దానికి కారణం ఈ షోలో హోస్ట్ గా ఉన్న యాంకర్ సుమ.

యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ ఫుల్ టు ఎంటర్ టైన్ మెంటే కదా. తను ఉంటే.. వేరే వాళ్లను మాట్లాడనీయదు. తనే గలగలా మాట్లాడేస్తుంది. అంతేనా.. ఎదుటివాళ్లను ఆటపట్టించడం.. వాళ్లతో ఆడుకోవడం.. షోకు వచ్చిన గెస్టులకు పంచ్ లు వేయడం, జోక్స్ చేయడం.. అన్నీ సుమకు వెన్నతో పెట్టిన విద్య.

Start Music : తాజాగా షోకు గెస్టులుగా వచ్చిన బాబా భాస్కర్, రఘు మాస్టర్

అయితే.. తాజాగా ఈ షోకు గెస్టులుగా బాబా భాస్కర్, రఘు మాస్టర్ వచ్చారు. వీళ్లంతా డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిలు. వీళ్లతో పాటు యాంకర్ భాను కూడా వచ్చింది.

అయితే.. ఈ షోలో బాబా భాస్కర్ ఫుల్ టు గెడ్డం పెంచడం చూసిన యాంకర్ సుమ.. బాబా భాస్కర్ గారు.. మీరు వెళ్లేటప్పుడు నాకు కొంచెం గెడ్డం ఇచ్చి వెళ్లండి. గిన్నెలు తోమడానికి పీచు కావాలి.. అంటూ యాంకర్ సుమ.. బాబా భాస్కర్ కు పంచ్ వేసేసరికి.. భాస్కర్ కు ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు అలాగే బ్లాంక్ అయిపోయాడు. ఎంతైనా యాంకర్ సుమ ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఏమంటారు?

దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 

 


Share

Related posts

Pariki Kampa: పరికి కంప చెట్టు ను ఈ విధంగా ఉపయోగిస్తే..!?

bharani jella

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా ఏకే రీమేక్ టైటిల్ ‘భీమ్లా నాయక్’

GRK

‘తిరుపతి ‘కొండకు దారం వేసి లాగాలని చూస్తున్న బీజేపీ!పవర్ స్టార్ పరపతిపై ఎన్నెన్నో ఆశలు!!

siddhu