NewsOrbit
న్యూస్

Statue Of Equality: విగ్రహం తయారీ సీక్రెట్లు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Statue Of Equality: సాధారణంగా గ్రామాల్లో నిర్మించిన ఆలయాల్లో చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలను రూపొందించాలంటేనే అనేక కష్టాలు తప్పవు. దేవుడి స్వరూపం ఒక్కో ఆలయంలో ఒక్కోలా కనిపిస్తుంటుంది. ఇక గ్రామాల్లో నెలకొల్పే విగ్రహాల గురించి అయితే చెప్పనవసరం లేదు. సిమెంట్, రాయితో విగ్రహాల తయారు చేయడమే అంతకష్టమైతే అతి పెద్దదైన, ప్రపంచంలో రెండోదైన 108 అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహం తయారు చేయాలంటే ఎంత నైపుణ్యం కావాలి. శంషాబాద్ సమీపంలో శ్రీరామనగరంలో త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 108 అడుగుల పంచలోహ విగ్రహా తయారీకి సంబంధించి పలు కీలకమైన విషయాలు ఇవీ..

"<yoastmark

Statue Of Equality: 2014 మే నెలలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు

ఈ దివ్య క్షేత్ర ప్రధాన స్థపతి తెలిపిన వివరాల ప్రకారం..చిన జీయర్ స్వామికి 2013లో ఈ ఆలోచన మొదలైంది. 2014 మే నెలలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. తొలుత చినజీయర్ స్వామి 14 రకాల రామానుజాచార్యుల నమూనాలను తయారు చేయించి వాటిలో బేస్టాఫ్ త్రీ తీసుకున్నారు. ఆ మూడు నమూనాల్లోని మేలైన రూపు రేఖలను జోడించి మరో అద్భుతమైన నమూనాను తయారు చేశారు. ఆ నమూనాను బెంగళూరులో 3 డీ స్కానింగ్ చేయించారు. ఆ విధంగా విగ్రహ ఆబ్జెక్ట్ ఫైల్ సిద్ధం అయ్యింది. ఆ సాఫ్ట్ ఫైల్ రూపాన్ని మాయ, మడ్ బ్రష్ సాఫ్ట్ వేర్లతో మరింత అందంగా తయారు చేశారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి చిన్న చిన్న అంశాలను సైతం చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. విగ్రహానికి ఇప్పటి రూపు రావడం కోసం ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో 22 రోజుల పాటు నిత్యం 18 నుండి 19గంటల పాటు కష్టపడ్డారు. చిన జీయర్ స్వామి రోజుకు రెండు మూడు గంటలు కేటాయించి సంప్రదాయ శాస్త్ర కొలతలకు సంబంధించి సూచనలు ఇస్తూ సాఫ్ట్ వేర్ ఫైల్ తయారు చేయించారు.

Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories

చైనాలోని ఏరోసెన్ కార్పోరేషన్ సంస్థ ఆధ్వర్యంలో..

అనంతరం విగ్రహా తయారీకి అంతర్జాతీయ స్థాయి కంపెనీని ఎంచుకున్నారు. భారీ విగ్రహాల తయారీలో విశేష నైపుణ్యం, అనుభవం ఉన్న చైనాలోని ఏరోసెన్ కార్పోరేషన్ కు విగ్రహా తయారీ బాధ్యతలను అప్పగించారు. అయితే విగ్రహ తయారీకి ముందు ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో థర్మోకోల్ తో 1:10 మోడల్ (సుమారు 16 నుండి 17 అడుగుల ఎత్తు) లో నమూనా విగ్రహం తయారు చేశారు. చినజీయర్ స్వామి చైనాకు వెళ్లి ఆ మోడల్ ను పరిశీలించి కొన్ని సవరణలు చేశారు. ఆ మేరకు సాఫ్ట్ వేర్ ఫైల్ లోనూ మార్పులు చేశారు. ఆ ఫైల్ తో మరో సారి థర్మోకోల్ తో 1:1 మోడల్ లో 20 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. దీనికి చినజీయర్ స్వామి ఆమోదం తెలియజేయడంతో ప్రధాన స్థపతి బృందం చైనా వెళ్లి క్వాస్టింగ్ అనుమతి ఇచ్చింది. 83 శాతం రాగితో పాటు వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలతో ఈ పంచలోహ రామానుజాచార్యుల విగ్రహం తయారు అయ్యింది.

విగ్రహం అంతా ఒకే పీస్ గా కాకుండా 1600 ముక్కులుగా చైనాలోని సదరు కంపెనీ సిద్ధం చేసింది. ఏరోసెన్ కార్పోరేషన్ కు చెందిన 70 మంది నిపుణుల బృందం ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చి అప్పటికే సిద్ధం చేసిన స్టీల్ నిర్మాణంపై లేయర్లు అతికించి విగ్రహానికి రూపును ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియకు 15 నెలలు పట్టింది. ఇప్పుడు 216 అడుగుల ఎత్తుతో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గా సమతామూర్తి విగ్రహం వెలుగొందుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?