matrimonial sites: మాట్రిమోనియల్ సైట్స్ లో  ఇలా సురక్షితం గా ఉండండి !!

Share

matrimonial sites: మోసపోకుండా
ఈ  రోజుల్లో అన్నీ ఆన్ లైన్  అయిపోయాయి.  పెళ్లి   విషయానికి వచ్చేసరికి ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.  మాట్రిమోనియల్ సైట్స్  రోజు రోజుకి లెక్క లేకుండా పెరిగిపోతున్నాయి.  దీనికి తగ్గట్టుగానే మాట్రిమోనియల్ మోసాల కూడా విపరీతం గా  పెరిగిపోయాయి. మాట్రిమోనియల్ చుట్టూ  అనేక రకాల నేరాలు   జరుగుతూనే ఉన్నాయి .
దీని వాళ్ళ చాల మంది   మోసపోతున్నారు కూడా.   దీనిలో మోసపోకుండా ఉండడం ఎలా..? ఎలాంటి జాగ్రత్తలు  పాటించాలి? మాట్రిమోనియల్ సైట్స్ లో మీ వివరాలు  పెట్టేముందు ఏ విషయాలు  గురించి ఆలోచించాలి? వేటిని  నమ్మాలి? అనే విషయాల గురించి బాగా  తెలిసి ఉండాలి.  వాటి గురించి తెలుసుకుందాం.


matrimonial sites: గోప్యత అనేది అవసరం

న్యూ ఏజ్ మ్యాట్రిమోనీ సైట్‌లు ప్రతి ఒక్క విషయం లో సెక్యూరిటీ, ప్రైవసీ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి.  సైట్లలో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకునే  వారికి కొత్త కొత్త టెక్నాలజీల ద్వారా విశ్వసనీయత చెక్ చేసి మరీ మోసాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. మ్యాట్రిమోనియల్ సైట్‌లు అందులో రిజిస్టర్ అయిఉన్నవారి  వివరాలను  తెలుసుకోవడానికి  చిన్న చెక్‌పాయింట్‌లను  ఇస్తుంది.   వీటివలన  తప్పుడు సమాచారానికి దూరంగా ఉండొచ్చు.
అలా కాకపోతే  సమాచారాన్ని నమ్మి, మోసపోయి ఇబ్బందులు పడవలిసి వస్తుంది. మొత్తానికి  ఈ కొత్త తరం మ్యాట్రిమోనియల్ సైట్‌లు తమ మీద నమ్మకం కుదిరే విధం గా  ఉండేందుకు  శాయశక్తులా  కృషి చేస్తున్నాయి.
ఆలోచనలు, అభిరుచులు తెలుసుకోవాలంటే…  ఇది వరకటి రోజుల్లో పెళ్లిళ్లు చేసుకునేవారు  ఇంట్లో పెద్దవారి ఇష్టాల  ఆధారం గా పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పటి సమాజం  మారింది. పెళ్లి చేసుకోబోయేవారి అభిప్రాయాలు, ఆలోచనలు కలిస్తేనే పెళ్లి కి ముందడుగు వేస్తున్నారు. ఈ అవకాశాన్ని మాట్రిమోనియల్ సైట్స్ బాగా అందిస్తున్నాయి.


matrimonial sites: సరైన ప్రొఫైల్ దొరకడానికి

ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే సదుపాయాన్ని విర్చువల్ గానే కలుగచేస్తున్నాయి. దీనివల్ల  జీవితాంతం  కలిసి బ్రతకావలిసిన వారి మధ్య బంధం దృఢంగా  ఉండే అవకాశం ఎక్కువ.
ఈ సైట్‌లలో తమకు సరైన ప్రొఫైల్ దొరకడానికి చాలా ఎక్కువ శ్రమ పడవలిసి ఉంటుంది. టైం తో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది.  ఈ న్యూ ఏజ్ మాట్రిమోనియల్ సైట్లు వినియోగదారుల    అభిరుచులకు, అవసరాలకు తగ్గ ఫ్రొఫైల్స్ ను మాత్రమే  అందిస్తాయి. దీనివల్ల సమయం సేవ్ అవుతుంది.  అల్గోరిథంలు ఇక్కడముఖ్య  పాత్ర  పోషించడం వలన ఒకేరకమైన వ్యక్తులు కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ న్యూ ఏజ్ మాట్రిమోనియల్ యాప్ ల ద్వారా మీ  లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కోవడం  చాలా తేలిక అవుతుంది.


Share

Related posts

ప్రభాస్ “రాధేశ్యామ్” సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు..!!

sekhar

Nimmagadda : వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చే ప్రయత్నంలో నిమ్మగడ్డ..? జగన్ అడ్డుకుంటారా?

somaraju sharma

హ్యాపీనెస్ట్ బుకింగ్స్ నేడు

Siva Prasad